ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన థాయ్‌లాండ్‌లో రామకియెన్‌ (థాయిలాండ్‌ వెర్షన్‌ రామాయణం) వీక్షించారు. ఇలా మోదీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తున్నారు  

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు భారత సంప్రదాయాలు, మతపరమైన వారసత్వాన్ని ప్రపంచానికి చూపించే వేదికగా మారుతున్నాయి. ఆయా దేశాల్లో భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక విశేషాలు కనిపిస్తున్నాయి. తాజాగా థాయ్‌లాండ్ పర్యటనలో మోదీ రామకియెన్ ప్రదర్శనను వీక్షించారు. ఇది థాయ్ సంస్కృతితో మిళితమైన రామాయణం కావడం విశేషం. థాయ్‌లాండ్‌లో ఇది జాతీయ పురాణంగా గుర్తింపు పొందింది.

Scroll to load tweet…

ఇలాంటివి మరికొన్ని విశేషాలు: 

* 2025 మార్చిలో మారిషస్ పర్యటన సందర్భంగా, మోదీ గంగా తలో సందర్శించి, త్రివేణి సంగమం నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాన్ని సమర్పించారు. ఇది భారత్, మారిషస్‌ల మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని చూపింది.

* 2024 డిసెంబర్‌లో కువైట్ పర్యటనలో, మహాభారతం, రామాయణాన్ని అరబిక్‌లో అనువదించి ప్రచురించిన ఇద్దరు కువైట్ పౌరులను ప్రధాని మోదీ కలుసుకున్నారు.

* 2024 నవంబరులో బ్రెజిల్ పర్యటనలో మోదీకి మంత్రోచ్చారణలతో ఘనస్వాగతం లభిచింది. అదే పర్యటనలో, రివో డి జెనీరోలో రామాయణాన్ని వీక్షించారు. 

* 2024 నవంబరులో గయానా పర్యటనలో చిన్నారులు రామభజనలు, వేదమంత్రాలతో మోదీకి ఆతిథ్యం ఇచ్చారు.

* 2024 అక్టోబర్‌లో రష్యా పర్యటనలో కజాన్ నగరంలో కృష్ణ భజనాన్ని రష్యన్ పౌరులు ఆలపిస్తూ మోదీకి స్వాగతం పలికారు.

* లావోస్ పర్యటనలో గాయత్రి మంత్రంతో స్థానికులు మోదీకి ఆతిథ్యం ఇచ్చారు. అలాగే లావో రామాయణం ప్రదర్శనను ప్రధాని వీక్షించారు.

* 2021లో ఇటలీ పర్యటనలో రోమ్ నగరంలో శివ మంత్రాలూ మార్మోగాయి.

ఈ ఘటనలు ప్రధాని మోదీ భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని చెప్పడానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.