MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Tuition Banned: ఆ దేశంలో ప్రైవేట్ ట్యూష‌న్లు నిషేధం.. కార‌ణం ఏంటో తెలుసా.?

Tuition Banned: ఆ దేశంలో ప్రైవేట్ ట్యూష‌న్లు నిషేధం.. కార‌ణం ఏంటో తెలుసా.?

Tuition Banned: చాలా దేశాల్లో ప్రైవేట్ ట్యూషన్లు పెద్ద పరిశ్రమగా మారిపోయాయి. పిల్లలు మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే ఓ దేశంలో మాత్రం ప్రైవేట్ ట్యూష‌న్లు పూర్తిగా నిషేధించారు. ఇంతకీ ఆ దేశం ఏంటంటే.?

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 15 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రైవేట్ ట్యూషన్ల‌పై నిషేధం
Image Credit : Gemini AI

ప్రైవేట్ ట్యూషన్ల‌పై నిషేధం

ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా చైనా ప్రైవేట్ ట్యూష‌న్ల‌ను నిషేధించింది. 2021లో చైనా ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. బిలియన్ల డాలర్ల విలువైన ప్రైవేట్ ట్యూషన్ పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా లాభాల కోసం నడిచే ట్యూషన్ సంస్థలను నియంత్రించేలా చట్టాలు తీసుకొచ్చింది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ప్రైవేట్ ట్యూషన్ సంస్థలు విద్యను ఒక భారీ పోటీగా మార్చాయి. ఫలితంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని తగ్గించడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

25
“డబుల్ రిడక్షన్” పాలసీ అమలు
Image Credit : Getty

“డబుల్ రిడక్షన్” పాలసీ అమలు

ఈ నిర్ణయం డ‌బుల్ రిడ‌క్ష‌న్ అనే విద్యా సంస్కరణలో భాగంగా తీసుకున్నారు. విద్యార్థులకు ఎక్కువ హోంవర్క్ తగ్గించడం, స్కూల్ బయట జరిగే ట్యూషన్ క్లాసులను నియంత్రించడం, పిల్లలకు చదువు ఒత్తిడిని తగ్గించడం వంటివి ఈ పాలసీ ప్రధాన లక్ష్యాలు. దీంతో విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ఇతర కార్యకలాపాలకు కూడా సమయం లభించాలని ప్రభుత్వం భావించింది.

Related Articles

Related image1
LPG: ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ వాడుతారు స‌రే.. మ‌రి క‌రెంట్ బిల్ త‌క్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసా.?
Related image2
Viral Video: ఇరాన్‌కు ఇంత సీన్ ఉందా.. మిస్సైల్ సిటీ వీడియో చూస్తే వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే
35
తగ్గుతున్న జనన రేటుపై ఆందోళన
Image Credit : Asianet News

తగ్గుతున్న జనన రేటుపై ఆందోళన

చైనాలో జననాల సంఖ్య తగ్గిపోవడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. పిల్లలను పెంచడం చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. ప్రత్యేకంగా నగరాల్లో తల్లిదండ్రులు ప్రైవేట్ ట్యూషన్ల కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా యువ దంపతులు పిల్లలను క‌న‌డానికి వెనుకంజ వేస్తున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ట్యూషన్ ఖర్చులు తగ్గించి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించాలని ప్రభుత్వం భావించింది.

45
విద్యార్థులపై చదువు ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యం
Image Credit : social media

విద్యార్థులపై చదువు ఒత్తిడి తగ్గించాలనే లక్ష్యం

చైనాలో చాలా మంది విద్యార్థులు ఉదయం స్కూల్‌కు వెళ్లి, సాయంత్రం ట్యూషన్ క్లాసులకు వెళ్లడం సాధారణంగా మారిపోయింది. వీకెండ్లు, సెలవులు కూడా ట్యూషన్లలోనే గడుస్తున్నాయి. దీంతో పిల్లలకు విశ్రాంతి, ఆటలు, స్నేహితులతో గడిపే సమయం లాంటివి చాలా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని అధికారులు “ర్యాట్ రేస్‌”గా అభివర్ణించారు.

55
వీకెండ్లు, సెలవుల్లో ట్యూషన్లకు పూర్తిగా నిషేధం
Image Credit : Getty

వీకెండ్లు, సెలవుల్లో ట్యూషన్లకు పూర్తిగా నిషేధం

నిబంధనల ప్రకారం స్కూల్ ప్రధాన సబ్జెక్టులు అయిన మ్యాథ్స్, సైన్స్, భాషలు వంటి విషయాలకు వీకెండ్లు, పబ్లిక్ హాలిడేలు, వేసవి–చలికాల సెలవుల్లో ప్రైవేట్ ట్యూషన్లు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించారు. ఇదే కాకుండా విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులపై కూడా కఠిన నియంత్రణలు అమలు చేశారు. ట్యూషన్ కంపెనీలలో విదేశీ పెట్టుబడులు పెట్టడాన్ని నిషేధించారు. విదేశీ టీచర్లు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించడంపై కూడా నియంత్రణలు విధించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
ఉద్యోగాలు, కెరీర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: ఇరాన్‌కు ఇంత సీన్ ఉందా.. మిస్సైల్ సిటీ వీడియో చూస్తే వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే
Recommended image2
LPG Crisis : హమ్మయ్యా.. హర్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకలు
Recommended image3
Hormuz Route: హార్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు ఓడ చేరడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా.?
Related Stories
Recommended image1
LPG: ఇండ‌క్ష‌న్ స్ట‌వ్ వాడుతారు స‌రే.. మ‌రి క‌రెంట్ బిల్ త‌క్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసా.?
Recommended image2
Viral Video: ఇరాన్‌కు ఇంత సీన్ ఉందా.. మిస్సైల్ సిటీ వీడియో చూస్తే వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved