Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ : యూకే వీసా ఆఫీస్ టీవీలో పోర్న్ వీడియో కలకలం..

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న యూకే వీసా కార్యాలయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కార్యాలయంలోని టీవీ స్క్రీన్‌పై ఫోర్న వీడియో ప్రసారం అయ్యింది. 

Pakistan : Porn video played on UK visa office TV - bsb
Author
First Published Nov 25, 2023, 12:30 PM IST

కరాచీ : పాకిస్థాన్‌లోని కరాచీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కరాచీలోని యూకే వీసా కార్యాలయంలో వెయిటింగ్ సమయంలో చూసేందుకు ఏర్పాటు చేసిన టీవీలో అకస్మాత్తుగా పోర్న్ వీడియోలు ప్లే కావడం ప్రారంభించాయి. వీసా కోసం లైన్‌లో నిలబడిన పౌరులు టీవీలో ఈ అసభ్య వీడియో చూసి షాక్ అయ్యారు. వెంటనే హడావిడిగా టీవీ స్విచ్ ఆఫ్ చేశారు.

గెర్రీ వీసా సెంటర్ లో ఒక్కసారిగా, అనుకోకుండా టీవీ స్క్రీన్‌పై అడల్ట్ వీడియో ప్రత్యక్షమయ్యింది. ఆ సమయంలో వీసా కోసం పౌరులు పత్రాలతో క్యూలో నిలబడి ఉన్నారు. ఈ ఘటన అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

కార్యాలయ సిబ్బంది టీవీ స్విచాఫ్ చేశారు
ఈ వీడియోలో మొదట కరాచీలోని వీసా కార్యాలయంలో వీసా అనుమతుల కోసం బారులు తీరిన జనం కనిపిస్తున్నారు. ఆ తరువాత వారు చూడడం కోసం ఇన్‌స్టాల్ చేసిన టీవీలో వచ్చే దృశ్యాల వైపు కెమెరా జూమ్ చేశారు. అందులో పొరపాటున అడల్ట్ వీడియో ప్లే అవుతోంది. మహిళలు, భద్రతా సిబ్బందితో సహా మరికొంతమంది అక్కడ ఉన్నారు. ఇలా ఆ అడల్ట్ వీడియో కాసేపు టీవీలో ప్లే అవుతూనే ఉంది. వెంటనే గుసగుసలు, వ్యతిరేకతలు, అభ్యంతరాలు మొదలయ్యింది. గొడవ జరిగిన కొద్దిసేపటికే కార్యాలయ సిబ్బంది సమస్యను పరిష్కరించారు. టీవీని స్విఛాఫ్ చేశారు.

 పాట్నా రైల్వే స్టేషన్‌లోనూ..
ఈ ఏడాది మార్చిలో బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రైలు షెడ్యూల్‌ను ప్రకటించడానికి ప్లాట్‌ఫారమ్‌పై అమర్చిన టెలివిజన్‌లో అడల్ట్ వీడియో ప్లే అయ్యింది. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios