Omicron: ఒమిక్రాన్ టీకా సామ‌ర్థ్యం త‌గ్గిస్తోంది.. వేగంగా వ్యాపిస్తోంది.. WHO హెచ్చ‌రిక‌లు

Omicron:  ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. దీనికిపై ఇప్ప‌టికీ ఖ‌చ్చిత‌మైన పూర్తి స‌మాచారం లేక‌పోవ‌డంతో ఓ నిర్ధార‌ణ‌కు రావ‌డం లేదు. అయితే, ప్ర‌స్తుతం ఉన్న డేటా ప్ర‌కారం.. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ద‌నీ, క‌రోనా వైర‌స్ టీకా సామ‌ర్థ్యాన్నిసైతం త‌గ్గిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ డ‌బ్య్లూహెచ్‌వో హెచ్చరించింది. 
 

Omicron Reduces Vaccine Efficacy, Spreads Faster, Says WHO

Omicron:  ప్ర‌పంచ దేశాల్లో క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యాందోళ‌న‌లు పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వెలుగుచూసిన క‌రోనా ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ల కంటే ఒమిక్రాన్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌నే అంచ‌నాలు ప్ర‌జ‌ల‌ను మ‌రింత భయాందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)  తాజాగా ప‌లు హెచ్చ‌రిక‌లు చేసింది. క‌రోనా వైర‌స్  డెల్టా  వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువగా వ్యాపిస్తుంద‌ని తెలిపింది.  కోవిడ్‌-19 వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంద‌ని వెల్ల‌డించింది. అయితే, ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  తెలిపింది.

Also Read: Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !

 

ఈ ఏడాది ప్రారంభంలో భార‌త్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ డెల్టా.. ప్ర‌పంచంలో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ‌కు కార‌ణ‌మైంది.  భార‌త్ లో క‌రోనా సెకండ్ వేవ్ ఈ వేరియంటే కార‌ణ‌మ‌ని ప‌లు రిపోర్టులు సైతం పేర్కొన్నాయి. అయితే, దీనికంటే ప్ర‌మాద‌క‌ర‌మైన‌దిగా భావిస్తున్న క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్‌ను గ‌త నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో గుర్తించారు. దీని ప్రాథ‌మిక డేటాను విశ్లేష‌ణ ఆధారంగా దీనిలో అధిక మ్యూటేష‌న్ల‌కు కార‌ణ‌మ‌య్యే స్పైక్ ప్రొటీన్‌లు అధికంగా ఉన్న‌ట్టు గుర్తించారు. దీని అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దిగా వైద్య నిపుణులు, ప‌లువురు ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ద‌క్షిణాఫ్రికాలో భారీ క‌రోనా కేసుల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైంది. ప్ర‌స్తుతం అక్క‌డ న‌మోద‌వున్న కేసుల్లో 70 శాతంపైగా ఒమిక్రాన్ కేసులే ఉంటున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ పై ప‌రిశోధ‌న‌లను ముమ్మ‌రం చేసింది. 

Also Read: America Hurricane:హరికేన్లతో అమెరికాలో అతలాకుతలం.. US చరిత్రలోనే..

ఈ నేప‌థ్యంలోనే ఒమిక్రాన్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ.. ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించింది. డిసెంబ‌ర్ 9 నాటికే ఒమిక్రాన్ వేరియంట్ 63కు పైగా దేశాల‌కు  విస్తరించిందని డబ్ల్యూహెచ్‌వో  తెలిపింది. డెల్టా వేరియంట్ ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్న ద‌క్షిణాఫ్రికాతో పాటు డెల్టా వేరియంట్ ప్ర‌భావం అధికంగా ఉన్న బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ద‌ని తెలిపింది.  అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి, ప్ర‌భావం, టీకాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించే తీరుపై ఇంకా పూర్తి డేటా రావాల్సి ఉంద‌ని తెలిపింది. "ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటాను బట్టి, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగే డెల్టా వేరియంట్‌ను Omicron అధిగమించే అవకాశం ఉంది" అని హెచ్చ‌రించింది. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉంద‌ని తెలిపింది. అయితే  తీవ్ర‌మైన ప్ర‌భావం చూప‌డం లేని కేసులు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయ‌ని పేర్కొంది.  టీకాలు సామ‌ర్థ్యాన్ని సైతం త‌గ్గిస్తున్న‌ద‌ని తెలిపింది. దీనికి సంబంధించి క్లినిక‌ల్ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి మ‌రింత డేటా కావాల‌ని పేర్కొంది. 

Also Read: Andhra Pradesh: వైకాపా నేత‌ల నాలుక‌లు తెగ్గొయాలంటూ పరిటాల సునిత సంచలన వ్యాఖ్య‌లు

ప్ర‌పంచంలోని మ‌రిన్ని దేశాల‌కు ఒమిక్రాన్ వేరియంట‌ట్ విజృభించ‌క‌ముందే  క‌రోనా వ్యాక్సినేష‌న్ వేగవంతం చేయాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అధిక మందికి క‌రోనా టీకాలు వేయ‌డం ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు అనే అభిప్రాయం వ్య‌క్తం చేసింది. ఇదిలావుండ‌గా, ఒమిక్రాన్ ఇప్పటికే 63 దేశాల‌కు పైగా విస్త‌రించింది. భార‌త్ ఈ ర‌కం కేసులు పెరుగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 38కి పైగా ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. 
Also Read: Miss Universe 2021 : భారత సుందరి హర్నాజ్ సంధుదే కిరీటం..!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios