MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • International
  • ఇరాన్ తో యుద్దంలో ట్రంప్ గెలిచినట్లా.. ఓడినట్లా..?

ఇరాన్ తో యుద్దంలో ట్రంప్ గెలిచినట్లా.. ఓడినట్లా..?

Iran US War :  పాపం ట్రంపయ్య పరిస్థితి ముందు నుయ్యి .. వెనుక గొయ్యి అన్నట్లు తయారయ్యింది. ఇరాన్ తో యుద్దం చేస్తే ఆర్థిక నష్టం… చెయ్యకపోతే పరువుపోతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తాడు..?

3 Min read
Author : Amarnath Vasireddy
Published : Mar 06 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇరాన్ తో యుద్దానికి ట్రంపే కారణమా..?
Image Credit : Getty

ఇరాన్ తో యుద్దానికి ట్రంపే కారణమా..?

1. "అమెరికా యుద్ధాన్ని మొదలెట్టలేదు . ఇరాన్ నలబై ఏళ్లుగా అమెరికాపై యుద్ధం చేస్తోంది . ఆ యుద్ధాన్ని ముగించే పనిలో ట్రంప్ ఉన్నాడు" - ట్రంప్ అభిమాని .

2. "ఇది కేవలం ఇరాన్ పై దాడి కాదు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలపై ముఖ్యంగా షియాలపై దాడి" - ఇరాన్ అభిమాని.

3. . "ఇరాన్ మత ఛాందసవాదాన్ని నేను సమర్తించడం లేదు . కానీ అమెరికా సామ్రాజ్యవాదం హద్దులు దాటుతోంది. అందరూ దీన్ని ఖండించాలి" - లెఫ్టిస్ట్ .

4. "అమెరికా లేకపోతే ఇరాన్ లాంటి దేశాలు, దాని నుంచి స్ఫూర్తిపొందే టెర్రరిస్ట్ గ్రూప్ లకు అడ్డుఅదుపూ ఉండదు" - రైటిస్ట్.

ఎవరి దృష్టి కోణం వారిది.

ఎవరి మనోభావాలు వారివి.

విశాల దృక్పధం, సహానుభూతి ఉంటే యుద్ధాలు ఎందుకు జరుగుతాయి..?

ద్రుష్టి కోణాలు... ఎలా ఉన్నా యుద్ధం యుద్ధమే.

అది అందరి బతుకుల్ని ప్రభావితం చేస్తుంది .

ఎందుకు మొదలయినట్టు?

కారణాలు అనేకం..

కానీ నా దృష్టిలో ముఖ్యమయిన కారణం ..

ట్రంప్ ట్రెంపరి తనం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ట్రంప్ గెలిచినట్టా.. ఓడినట్టా?
Image Credit : X

ట్రంప్ గెలిచినట్టా.. ఓడినట్టా?

దేశంలో పరిస్థితులు ఏమీ బాగా లేవు . నిరుద్యోగం బాగా పెరిగిపోతోంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత.

సాహసం సేయరా డింభకా .. అని ఏదైనా చేసి అందరితో హీరో అనిపించుకోవాలి. ప్రత్యర్థుల నోళ్లు మూయాలి.

పొరుగు దేశ నాయకుడ్ని కిడ్నాప్ చేసుకెళ్లి పోయాడు.

ఇప్పుడు చిరకాల ప్రత్యర్థిని చంపేశాడు.

వారేవా .. ట్రంప్..!

ట్రంప్ గెలిచినట్టేనా ?

లైఫ్ ... అంత ఈజీ కాదు .

విజయంలో అపజయం దాగుంటుంది.

రష్యా సూపర్ పవర్.

యుక్రెయిన్... దాని నుంచి కొనేళ్ల క్రితం విడిపోయిన చిన్న దేశం. రష్యా అధక్షుడు ఎన్నో నెలలుగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. విజయం కనుచూపుమేరలో లేదు.

బాగా దెబ్బలు తింటున్నా యుక్రెయిన్ రష్యాకు చుక్కలు చూపుతోంది.

అవతలి వారి అనుభవాలనుంచి పాఠాన్ని గ్రహించినోడే నిజమయిన నాయకుడు.

మొన్నటి దాక ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేకత తారా స్థాయిలో ఉంది. ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు అల్లాడి పోయారు. ఇప్పుడు యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితులు మరింత దెబ్బ తింటాయి.

కానీ మెజారిటీ ప్రజలు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు.

అమెరికా అంతే !

వియత్నాంలో దెబ్బ తింది.

సివరాకరికి ఆఫ్గనిస్తాన్ ను ఏదో చెయ్యాలని ... ఏదో ఏదో చేసేసి .. చేతులు కాల్చుకొని సైలెంట్ గా వెళ్లి పోయింది. ఇప్పుడు ఇరాన్ ను మాత్రం ఏమి చేయగలదు?

Related Articles

Related image1
Iran: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌.. ఎవరీ మోజ్తబా ఖమేనీ? షాక్ లో ట్రంప్ !
Related image2
Iran Israel War : ఇండియాను తాకిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్ సెగ.. విశాఖవాసులు బిగ్ షాక్
34
ఇరాన్ యుద్దం.. నెక్ట్స్ జరిగేదిదేనా..?
Image Credit : ChatGPT

ఇరాన్ యుద్దం.. నెక్ట్స్ జరిగేదిదేనా..?

ఇరాన్ నాశనం అవుతోంది.. నిజమే..

మరి అమెరికా సంగతి?

అమ్ముల పొదిలో అమ్ములు అయిపోతోంది. ఆర్థిక భారం తడిసి మోపెడవుతోంది.

మొండివాడు రాజు కంటే బలవంతుడు..

ఇరాన్ దెబ్బ మీద దెబ్బ తెస్తోంది.

ముందడుగు వెయ్యడం అంత ఈజీ కాదు .

వెనకడుగు వేస్తె పరువు పోతుంది.

ముందు నుయ్యి .. వెనుక గొయ్యి.

పాపం ట్రంపయ్య !

ఏమి కావొచ్చు?

ఇరువురికీ పరువు దక్కేలా ఏదో రాజీ ఫార్ములా ముందుకు రావాలి.

వచ్చే అవకాశం ఉంది .

లేకుంటే పరిస్థితులు దారుణమవుతాయి .

మన అదృష్టం... ఇప్పుడు ప్రపంచంలో హిట్లర్ లాంటి వాడు లేడు .

ఎంత కాదనుకున్నా ట్రంప్ బిజినెస్ మాన్.

హిట్లర్ లా మానసిక రోగి కాడు .

పుతిన్ సంగతి వేరు .

అతను రష్యాకు నియంత. ప్రజాభిప్రాయంతో సంభంధం లేదు .

అమెరికా ప్రజాస్వామ్య దేశం. పబ్లిక్ ఒపీనియన్ ను కాదనుకునే పరిస్థితి లేదు.

44
నీటి యుద్దం జరిగితే..?
Image Credit : Getty

నీటి యుద్దం జరిగితే..?

చమురు నిల్వలు అయిపోతే మన దేశంలో ఆకలి చావులు దాక వెళ్ళేది .

మన అదృష్టవంతులము .. తప్పించుకొన్నట్టే అనిపిస్తోంది.

బతుకు తెరువు కోసం మన దేశంనుంచి గల్ఫ్ కు పోయి జీవన పోరాటం చేస్తున్న లక్షలాది మంది.

వారికి వందనం.

నాకు అర్థంకాని విషయం ఏంటంటే కోట్లు గడించినవారు..ఇక్కడ ఆస్తులు అమ్ముకొని దుబాయ్ కి పోయి.. బుర్జ్ ఖలీఫాలోనో, ఇంకో చోట ఆవాసాలు కొనుక్కొని సెటిల్ కావడం.

నిజమే ఆ ప్రభుత్వ సంకల్ప బలం గొప్పది.

ఎడారిలో నందన వనాన్ని సృష్టించింది .

కానీ ఎడారి ఎడారే .

జరగకూడదు .. కానీ జరిగితే ?

ఇరాన్ గల్ఫ్ దేశాల సముద్రపు నీరు శుద్ధి చేసి తాగునీరుగా మార్చే యంత్రాలను కొన్నింటిని నాశనం చేసినా..

ఊహించలేము...

గుక్కెడు నీళ్లు లేక ప్రజలు...

వద్దు అశుభం మాటలు వద్దు.

ఎనిమిదేళ్ల క్రితం దుబాయ్ కి వెళ్ళినపుడు అక్కడ నన్ను బడి స్థాపించాలని... తాము పెట్టుబడులు పెడుతామని చెప్పిన మిత్రులకు ఇదే మాట చెప్పాను.

"ఈ ప్రభుత్వం గొప్పదే. కానీ ఒక పక్క ఇరాన్.. ఇంకో పక్క ఇరాక్.. సిరియా.. తుర్కీయే.. రాను ... దుబాయ్ కి... రాను" ..అని చెప్పి వచ్చేసాను .

కథలో నీతి : పొరుగువాడు .. వాడు ఎలాంటి వాడైనా .. నాశనం అయితే .. మనం కూడా దెబ్బతింటాము.

సర్వే జనా సుఖినోభవంతు !

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
యుద్ధం
డొనాల్డ్ ట్రంప్
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: ముప్పు ఇంకా ముగిసిపోలేదు.. నేపాల్‌కు చైనా హెచ్చ‌రిక‌, మ‌రో 3 రోజుల్లో
Recommended image2
USA: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం.. అమెరికా వెళ్లే భార‌తీయుల‌కు గ‌ట్టి షాక్
Recommended image3
Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న సద్గురు టీమ్.. ఈ హీరోయిన్ సంగతేంటి?
Related Stories
Recommended image1
Iran: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌.. ఎవరీ మోజ్తబా ఖమేనీ? షాక్ లో ట్రంప్ !
Recommended image2
Iran Israel War : ఇండియాను తాకిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్ సెగ.. విశాఖవాసులు బిగ్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved