Miss Universe 2021 : భారత సుందరి హర్నాజ్ సంధుదే కిరీటం..!
Miss Universe 2021 : అంగరంగ వైభవంగా కొనసాగిన విశ్వసుందరి (మిస్ యూనివర్స్) 2021 పోటీల్లో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు కిరీటాన్ని గెలుచుకుంది. 70వ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయేల్ లో జరుగుతుతుండగా, హర్నాజ్ సంధు Miss Universe 2021 కీరిటం గెలుచుకుంది. పెరుగ్వేకు చెందిన నదియా ఫెరీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా లాలీ మస్వానే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిచారు.
Miss Universe 2021 : అంగరంగ వైభవంగా కొనసాగిన విశ్వసుందరి (మిస్ యూనివర్స్) 2021 పోటీల్లో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు కిరీటాన్ని గెలుచుకుంది. 70వ మిస్ యూనివర్స్ పోటీలు ఇజ్రాయేల్ లో జరుగుతుతుండగా, హర్నాజ్ సంధు Miss Universe 2021 కీరిటం గెలుచుకుంది. పెరుగ్వేకు చెందిన నదియా ఫెరీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా లాలీ మస్వానే వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిచారు.
Also Read: Himachal Pradesh: భారీ అగ్ని ప్రమాదం.. 27ఇండ్లు దగ్ధం
ఇజ్రాయెల్‌లోని సౌత్‌మోస్ట్ సిటీ ఐలాట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'మిస్ యూనివర్స్ 2021' అందాల పోటీలో, భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలుచుకుంది. చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ సంధు తనకు పోటీగా నిలిచిన పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా లాలీ మస్వానేపై వెనక్కి నెట్టి కీరిటం దక్కించుకున్నారు. దాదాపు 21 సంత్సరాల తర్వాత..భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. మొత్తంగా దేశనికి మూడో మిస్ యూనివర్స్ కిరీటం హర్నాజ్ సంధు అదించారు. గతంలో 1994లో సుస్మితా సేన్, 2000లో లారాదత్తాలు Miss Universe కీరిటాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఇజ్రాయిల్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో హర్నాజ్ కౌర్ ప్రపంచ సుందరిగా నిలిచారు. దాదాపు 80 మంది పోటీదారులతో పోటీపడి కిరీటాన్ని దక్కించుకుంది హర్నాజ్ కౌర్ సింధు.
Also Read: Afghanistan hunger crisis: ఆకలి కేకల ఆఫ్ఘాన్..
జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. హర్నాజ్ కౌర్ సంధు...న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెబుతూ..వారి మనస్సులను గెలుచుకున్నారు. రోజు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలి ? యువతులకు మీరు ఏ సలహా ఇస్తారు అంటూ న్యాయ నిర్ణేతలు పోటీదారులను ప్రశ్నించారు. తమకు తాము ప్రత్యేకం అని తెలుసుకోవాలని, ఇతరులతో పోల్చుకోవడం మానేయాలని హర్నాజ్ సంధు సూచించారు. ప్రతి ఒక్కరి జీవితానికి వారే నాయకులని అన్నారు. అందుకే తాను ఇక్కడ నిలబడ్డానని చెప్పారు. దీంతో టాప్-5 నుంచి టాప్ 3 ప్లేస్ లో చోటు దక్కించుకున్నారు. విశ్వసుందరిగా ఆమె పేరు చెప్పగానే ఆనందంతో కన్నీళ్లు కార్చారు హర్నాజ్ సంధు.
Also Read: Nadendla Manohar: తెలంగాణ ఎంపీల లాగా ఎందుకు చేయట్లేదు? : నాదేండ్ల మనోహర్
హర్నాజ్ కౌర్ సంధు జీవితం..
21 ఏండ్ల హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. పాఠశాల విద్యను శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పూర్తిచేసింది. తరువాత ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా చేయడం అలవాటుగా ఉంది. ఫిట్‌నెస్ కోసం ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ చేయడం తనకు అమితంగా ఇష్టమని ఇదివరకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేదని చెప్పింది. అయితే, బక్కగా, సన్నగా ఉండటంపై హేలన చేసేవారు. ఇవేవి పట్టించుకోకుండా.. కుటుంబ సభ్యుల సహకారంతో 17 ఏండ్లకే మోడలింగ్ లో అడుగుపెట్టారు. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ ప్రయాణం ప్రారంభించారు. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే మరోపక్క ఫ్యాషన్ షోల్లోనూ పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. 2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్–12 జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ ఏడాదిలోనే ‘మిస్ దివా యూనివర్స్ ఇండియా–2021’ కిరీటాన్ని సైతం దక్కించుకుంది. ఇప్పుడు మిస్ యూనివర్స్ గా నిలిచింది.
Also Read: Karnataka: బంగారు నెక్లెస్‌ని మింగిన ఆవు.. ఏం చేశారంటే..