Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి అధికమవుతూనే ఉంది. పలు ఆఫ్రికా దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ కు కారణమవుతోంది. భారత్‌లోనూ ఈ రకం కేసులు పెరుగుతన్నాయి. ఇదే సమయంలో సాధారణ కరోనా కొత్త కేసులు తగ్గుతుండటం అనుకూలించే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్.. భారత్‌లో ఈ రకం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా కేసులు నమోదైన ప్రాంతాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో సాధారణ కరోనా వైరస్ కొత్త కేసుల్లో తగ్గుదల నమోదుకావడం కొద్దిగా ఊరట కలిగిస్తున్నది. సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కోవిడ్-19 వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 7350 కరోనా కేసులు (Corona cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,97,860కి చేరింది. ఇదే సమయంలో కొత్తగా 7,973 మంది కోలుకోకున్నారు. దీంతో కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,41,30,768కి పెరిగింది. యాక్టివ్ కేసులు సైతం తగ్గుముఖం పట్టాయి. భారత్ లో ప్రస్తుతం 91,456 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 561 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: America Hurricane:హరికేన్లతో అమెరికాలో అతలాకుతలం.. US చరిత్రలోనే..
ఇదిలావుండగా, గత 24 గంటల్లో కరోనా వైరస్ తో పోరాడుతూ 202 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్-19 తో చనిపోయిన వారి సంఖ్య 4,75,636కు పెరిగింది. కొత్తగా నమోదైన కరోనా వైరస్ మరణాల్లో అధికం కేరళ, మహారాష్ట్రలో వెలుగుచూశాయి. అలాగే, మొత్తం కరోనా వైరస్ కేసుల్లో యాక్టివ్ కేసులు 0.26 శాతం ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 98.37 శాతం ఉంది. మరణాల రేటు 1.35 శాతంగా ఉంది. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు టాప్-10లో ఉన్నాయి. సాధారణ కరోనా కేసులు తక్కువగా నమోదవున్నప్పటికీ దేశంలో దక్షిణాఫ్రికాలో వెలుగుచూపిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం చర్యలను వేగవంతం చేశాయి. కరోనా మార్గదర్శకాలను పకడ్బందిగా అమలు చేస్తున్నాయి.
Also Read: Andhra Pradesh: వైకాపా నేతల నాలుకలు తెగ్గొయాలంటూ పరిటాల సునిత సంచలన వ్యాఖ్యలు
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్, పరీక్షలు చేయడంలో వేగం పెంచారు అధికారులు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 65,66,72,451 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 8,55,692 కోవిడ్-19 శాంపిళ్లను పరీక్షించినట్టు వెల్లడించింది. అలాగే, దేశంలో ఇప్పటివరకు మొత్తం 133.2 కోట్ల కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులన పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తంగా కరోనా వైరస్ టీకాలు తీసుకోవడానికి అర్హులైన వారిలో సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్లు అందించారు. మొత్తం 133.2 కోట్ల డోసులు పంపిణీ చేయగా, అందులో మొదటి డోసు తీసుకున్నవారు 81.5 కోట్ల మంది ఉన్నారు. పూర్తి డోసులు (రెండు డోసులు) 51.6 కోట్ల మంది తీసుకున్నారు. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు భారత్‌లో 38కి చేరుకున్నాయి. ఈ వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి టీకా వేగాన్ని పెంచాలని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Miss Universe 2021 : భారత సుందరి హర్నాజ్ సంధుదే కిరీటం..!