America Hurricane:హరికేన్లతో అమెరికాలో అతలాకుతలం.. US చరిత్రలోనే..
America Hurricane: అధునాతమైన టెక్నాలజీతో దూసుకుపోతున్న అమెరికాపై ప్రకృతి ప్రకోపం కొనసాతున్నది. చాలా కాలం నుంచి ఆ దేశంలో హరికేన్ల కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు లక్షల కోట్ల ఆర్థిక నష్టం కలుగుతోంది. శుక్ర, శనివారాల్లో భారీ టోర్నడోలు విరుచుపడటంతో భారీ ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం సంభవించింది. ఆరు రాష్ట్రాలను అతాలకుతలం చేసిన ఇది.. సూపర్ హరికేన్ అని పేర్కొంటున్నారు.
America Hurricane: చాలా కాలం నుంచి హరినేన్లు అమెరికాలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. గతవారం చివర్లో ఏడు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా తలెత్తిన భారీ టోర్నడోలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల ధాటికి ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోపోయాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఇప్పటి వరకూ అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో 30 ప్రాంతాలు హరికేన్‌ల బారినపడి విలవిలలాడుతున్నాయి. శని, శుక్రవారాల్లో తాకిన తుపానులు పెను విధ్వంసం సృష్టించాయి. ఈ హరికేన్ల కారణంగా వివిధ ప్రాంతాల్లో 100 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఒక్క కెంటకీ రాష్ట్రంలోనే, 80 మంది చనిపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. చాలా మంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం రక్షించడం కోసం సహాయం చేయాలని అక్కడి అధికారులు ప్రజలను కోరారు. నష్టపోయిన వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Also Read: Andhra Pradesh: వైకాపా నేతల నాలుకలు తెగ్గొయాలంటూ పరిటాల సునిత సంచలన వ్యాఖ్యలు
అయితే, Northeastern AR ప్రారంభమైనట్టుగా అంచనా వేస్తున్న ఈ హరికేన్లు మొత్తం ఏడు రాష్ట్రాల మీదుగా పయనించాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కెంటకీ వంటి రాష్ట్రాల్లో నెను విధ్వంసం సృష్టించాయి. ఇదే గనక నిర్థారణ అయితే, అమెరికా చరిత్రలోనే ఎక్కువ సమయం, అధిక దూరం ప్రయాణించిన సూపర్ హరికేన్లుగా రికార్డు సృష్టించనున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత హరికేన్లతో కెంటకీతో పాటు మేఫీల్డ్‌లో భారీ స్థాయిలో నష్టం జరిగింది. మేఫీల్డ్‌లో కొవ్వొత్తుల కర్మాగారం కూలి 18 మంది మరణించారు. ఇల్లినాయిస్ రాష్ట్రంలో అమెజాన్ కంపెనీ గోదాము కుప్పకూలింది. సుమారు 100 మంది కార్మికులు శిథిలాల కింద సమాధి అయ్యారని భావిస్తున్నారు. అక్కడ సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అర్కాన్సాస్‌లోని నర్సింగ్‌హోమ్ భవనం కూలిపోవడంలో 20 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇప్పటికీ కురుస్తున్న వానలతో సహాయ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read: Miss Universe 2021 : భారత సుందరి హర్నాజ్ సంధుదే కిరీటం..!
కెంటకీ ప్రస్తుత పరిస్థితులపై ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషియర్ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించామన్నారు. మరణాలు సైతం భారీగా పెరిగే అవకాశముందని అన్నారు. ఎడ్వర్డ్స్‌విల్లే ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జర్ అన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. అలాగే, మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్, టెన్నెసీలోని వివిధ ప్రాంతాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. అమెరికా చరిత్రలో 1925 తర్వాత అత్యంత తీవ్రమైన హరికేన్లు ఇవేనని అధికారులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం హరికేన్ల కారణంగా ఆయా రాష్టాల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద విపత్తుల్లో ఒకటి బైడెన్ అన్నారు. కెంటకీలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ఆయన.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Himachal Pradesh: భారీ అగ్ని ప్రమాదం.. 27ఇండ్లు దగ్ధం