స్టాక్‌హోం:  ఆర్ధికశాస్త్రంలో అమెరికా ఆర్ధికవేత్తలు పార్ ఆర్. మిల్ గ్రోమ్, రాబర్ట్ విల్సన్ లకు నోబెల్ ప్రైజ్ దక్కింది.

సోమవారంనాడు నోబెల్ కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. కొత్త వేలం ప్రక్రియలను కనిపెట్టినందుకు వీరికి నోబెల్ బహుమతిని ఇస్తున్నట్టుగా నోబెల్ అకాడమీ ఇవాళ ప్రకటించింది.

 

2020 ఎకనామిక్స్ సైన్సెస్ లో పాల్ మిలిగ్రామ్ వేలం సాధారణ సిద్దాంతాన్ని రూపొందించారు. ఇది సాధారణ విలువలను మాత్రమే కాకుండా బిడ్డర్ నుండి బిడ్డర్ వరకు మారుతున్న ప్రైవేట్ విలువలను కూడ అనుమతిస్తుంది.

ఆర్ధిక వేత్తలు పాల్ మిల్ గ్రోమ్, రాబర్ట్ విల్సన్ లు వేలం సిద్దాంతాన్ని మరింత సరళీకరించారు. ఈ విధానంలో కొత్త పద్దతులను కనిపెట్టారు. ఈ కొత్త పద్దతుల ద్వారా విక్రయదారులతో పాటు కొనుగోలుదారులకు, పన్ను చెల్లింపుదారులకు కూడ అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి.