Asianet News TeluguAsianet News Telugu

అక్కడ పెళ్లికి ముందు సెక్స్, వివాహేతర సంబంధాలపై నిషేధం.. చట్టాన్ని అతిక్రమిస్తే ఇక అంతే..

అక్కడ వివాహానికి ముందు సెక్స్ పాల్గొనడంపై నిషేధం విధించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఏడాది వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే వివాహేతర లైంగిక సంబంధాలపై నిషేధం వర్తిస్తుంది.

Indonesia banning sex outside marriage passes new criminal code
Author
First Published Dec 6, 2022, 5:26 PM IST

ఇండోనేషియా పార్లమెంట్ కొత్త క్రిమినల్ కోడ్‌ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం వివాహనికి ముందు సెక్స్ పాల్గొనడంపై నిషేధం విధించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఏడాది వరకు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే వివాహేతర లైంగిక సంబంధాలపై నిషేధం వర్తిస్తుంది. మరోవైపు రాజకీయ స్వేచ్ఛను పరిమితం చేశారు. ముస్లిం మెజారిటీ దేశంలో మతపరమైన సంప్రదాయవాదం పెరిగిన తర్వాత ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ చట్టం ప్రకారం.. భర్త లేదా భార్య కాని వారితో లైంగిక సంబంధం నిషేధించబడింది. వివాహం లేకుండా స్త్రీ, పురుషుల మధ్య సహజీవనం నిషేధించబడింది. అవివాహిత జంటల సహజీవనం నేరంగా పరిగణించబడుతుంది. చట్టవిరుద్ధంగా సహజీవనం చేస్తే గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది. వివాహానికి ముందు లైంగిక సంబంధం కలిగి ఉంటే ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది. ఇది స్థానికులకు, ఇండోనేషియాలో నివసిస్తున్న విదేశీయులకు, బాలి వంటి హాలిడే స్పాట్స్ సందర్శించేవారికి సమానంగా వర్తిస్తుంది. అధ్యక్షుడిని అవమానించడం కూడా క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది. వివాహేతర లైంగిక చర్యలకు ఒక వ్యక్తిపై జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు మాత్రమే రిపోర్టు చేయవచ్చు. 

‘‘బిల్లుపై చర్చ సందర్భంగా విభిన్న అభిప్రాయాలకు అనుగుణంగా మేము మా వంతు ప్రయత్నం చేశాం. శిక్షాస్మృతి సవరణపై చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి, మనకు వారసత్వంగా వచ్చిన వలసవాద క్రిమినల్ కోడ్‌ను వదిలివేయడానికి ఇది సమయం’’ అని న్యాయ శాఖ మంత్రి యసోనా లావోలీ పార్లమెంటుకు తెలిపారు.

అయితే విమర్శకులు మాత్రం ఈ చట్టాలను మానవ హక్కులకు ఒక విపత్తుగా చూస్తున్నారు. పర్యాటకం, పెట్టుబడులకు ఈ చట్టాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని  అంటున్నారు. కొత్త నిబంధనలు మహిళలు, ఎల్‌జీబీటీ ప్రజలు, జాతి మైనారిటీలను అసమానంగా ప్రభావితం చేస్తున్నాయని హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

ఈ డ్రాఫ్ట్ కోడ్‌ను మూడు సంవత్సరాల కిందనే అమలు చేయాల్సింది. కానీ దేశవ్యాప్తంగా వేలాది మంది ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఈ వారం జకార్తాలో పార్లమెంటు వెలుపల అనేక సమూహాలు చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. కొత్త చట్టాలను కోర్టులో సవాలు చేయవచ్చని వారు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios