Asianet News TeluguAsianet News Telugu

ఖైదీలతో మహిళా అధికారిణి శృంగారం, నగ్నంగా వీడియోకాల్స్..!

ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్‌ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్‌ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది.

Former California Correctional Officer Sentenced for Having Sex With Inmate
Author
Hyderabad, First Published Jul 5, 2021, 7:32 AM IST

ఓ మహిళా అధికారిణి... జైల్లోని ఖైదీలను లైంగికంగా వేధించింది. జైల్లోని ఖైదీలకు నగ్నంగా వీడియో కాల్స్ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడేది. ఫోన్ కాల్స్ లో శృంగార సంభాషణలు చేయాలంటూ వేధించేది. ఈ సంఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకోగా... ఇటీవల సదరు అధికారిణిని ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

టీనా గోన్‌జలెజ్‌.. వయసు 27. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసేది. ఆ మూడేళ్లలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందన్నది ఆమెపై నమోదైన ప్రధాన ఆరోపణ. 

దర్యాప్తు సమయంలో గోన్‌జలెజ్‌ జైల్లో పాల్పడ్డ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అధికారులు.. ఆ వివరాల్ని జడ్జి ముందు ఉంచారు. ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదని తేలింది.

 ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్‌ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్‌ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్‌కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు. 

ఈ లైంగిక ఆరోపణలతోపాటు.. పని కూడా సరిగా చేసేది కాదంటూ ఆమెపై విమర్శలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్‌ సప్లై చేసేదని, ‘సెక్స్‌ రిటర్న్‌ గిఫ్ట్‌’లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి, ఈ నివేదికను రూపొందించిన స్టీవ్‌ మెక్‌కోమాస్‌ కోర్టుకు వెల్లడించాడు. నిందితురాలి తరపున కౌన్సెలర్‌ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్‌జలెస్‌ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించండి’ అని వేడుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios