Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు ఇండో అమెరికన్ సైంటిస్ట్ లకు అరుదైన గౌరవం.. యూఎస్ అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేసిన బైడెన్

భారతీయ అమెరికన్లకు ఆ దేశం ప్రతిష్టాత్మక అవార్డులు ఇచ్చి గౌరవించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసినందుకు గాను మన దేశానికి చెందిన ఇద్దరు సైంటిస్టులకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పురస్కారాలు ప్రదానం చేశారు.

A rare honor for two Indo-American scientists.. Biden awarded US highest awards..ISR
Author
First Published Oct 25, 2023, 1:48 PM IST

ఇద్దరు భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలకు అరుదైన గౌరవం లభించింది. శాస్త్ర, సాంకేతిక రంగానికి చేసిన సేవలకు గాను ఇద్దరు  అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ లకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ అత్యున్నత శాస్త్రీయ పురస్కారాలతో మంగళవారం సత్కరించారు. యూసీ బర్కిలీలోని సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఎమెరిటస్ గాడ్గిల్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీలకు జీవనాధార వనరులను అందించినందుకు ప్రతిష్ఠాత్మక వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డు అందుకున్నారు.

 ప్రముఖ యుఎస్ ఆవిష్కర్తలకు ఇచ్చే ఈ పురస్కారం, అమెరికా పోటీతత్వం, జీవన నాణ్యతకు శాశ్వత సహకారం అందించిన వారిని గుర్తిస్తుంది. దేశ సాంకేతిక శ్రామిక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కాగా.. వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అందుకున్న 12 మందిలో గాడ్గిల్ ఒకరు.

అలాగే బ్రౌన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సురేశ్ కు ఇంజినీరింగ్, ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ లలో పరిశోధనలు చేసినందుకు, ముఖ్యంగా మెటీరియల్ సైన్స్ అధ్యయనాన్ని, ఇతర విభాగాలకు దాని అనువర్తనాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ లభించింది. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) మాజీ అధిపతి అయిన సురేశ్ తో పాటు మరో ఎనిమిది మంది ఈ ప్రతిష్టాత్మక సైన్స్ మెడల్ అందుకున్నారు. 

కాగా..  గాడ్గిల్  సురక్షితమైన తాగునీటి టెక్నాలజీలు, శక్తి-సమర్థవంతమైన పొయ్యిలు, సమర్థవంతమైన విద్యుత్ దీపాలను చౌకగా చేసే మార్గాలతో సహా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలోని కొన్ని పరిష్కరించలేని సమస్యలకు తక్కువ ఖర్చుతో పరిష్కారాలను డెవలప్ చేశారు. ఆయన ప్రాజెక్టులు 100 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయపడ్డాయి. 

గాడ్గిల్ బొంబాయి విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ముంబై), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ నుండి భౌతికశాస్త్రంలో డిగ్రీలు, యూసీ బర్కిలీ నుండి పీహెచ్ డీ పొందారు. ఆ తర్వాత 1980లో లారెన్స్ బర్కిలీ నేషనల్ లాబొరేటరీ (బర్కిలీ ల్యాబ్)లో చేరి.. అధ్యాపకుడి  గా ఈ ఏడాది ప్రారంభంలో పదవీ విరమణ చేశారు. ఆయన గతంలో ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ టెక్నాలజీస్ డివిజన్ డైరెక్టర్ గా పనిచేశారు.

అలాగే అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మరో ఇండో అమెరికన్ సైంటిస్ట్ సురేష్ 1956 లో భారత్ లో జన్మించారు. 15 సంవత్సరాల వయస్సులో హైస్కూల్ చదువును పూర్తి చేశాడు. 25 సంవత్సరాల వయస్సులో, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీని పొందారు. సురేష్ 1983 లో బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీలో చేరిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. 

బ్రౌన్ లో 10 సంవత్సరాల తరువాత సురేష్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) కు నాయకత్వం వహించిన మొదటి ఆసియాలో జన్మించిన అమెరికన్ అయ్యాడు. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నామినేట్ చేయడంతో ఆ సంస్థ 13 వ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన సెప్టెంబర్ 2023 లో బ్రౌన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కు తిరిగి వచ్చారు. ఈ నెల ప్రారంభంలో పాఠశాల అతడి గౌరవార్థం సాంకేతికత, సమాజం సరిహద్దులపై దృష్టి సారించే ద్వైవార్షిక సింపోజియంను ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios