మమ్మల్ని రక్షించండి: ఇండియాను కోరిన రష్యన్ ఆర్మీలో పనిచేస్తున్న నేపాల్ వాసులు (వీడియో)
రష్యాలో ఉన్న తమను రక్షించాలని నేపాల్ వాసులు కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను వారు పోస్టు చేశారు.
న్యూఢిల్లీ: భారతీయులను రష్యాకు రప్పించి ఉక్రెయిన్ పై పోరాడేందుకు సైన్యంలో రిక్రూట్ చేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. అయితే ఇలాంటి పరిస్థితిని నేపాల్ పౌరులు కూడ ఎదుర్కొంటున్నట్టుగా ఓ వీడియో వెలుగు చూసింది. తమను రక్షించాలని నేపాల్ వాసులు భారత ప్రభుత్వాన్ని కోరారు.
also read:యాదాద్రి లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం: పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి
తమను రక్షించాలని నేపాల్ ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకపోవడంతో భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించినట్టుగా ఆ వీడియోలో పేర్కొన్నారు బాధితులు.తమతో పాటు ఉన్న భారతీయులను నరేంద్ర మోడీ సర్కార్ కాపాడిందని బాధితులు ఆ వీడియోలో పేర్కొన్నారు. తమను రక్షించేందుకు నేపాల్ రాయబార కార్యాలయం, ప్రభుత్వం సహాయం చేయలేకపోయినట్టుగా బాధితులు పేర్కొన్నారు.
also read:రైలులో సీటు కోసం గొడవ: వ్యక్తిని నిలదీసిన మహిళలు, నెట్టింట వైరల్
భారతదేశం, నేపాల్ మధ్య మంచి సంబంధాలున్నాయి. భారత్ శక్తివంతమైన దేశం.నేపాల్ మాదిరిగా కాకుండా తమను రక్షించే సామర్ధ్యం ఇండియాకు ఉందని బాధితులు అభిప్రాయపడ్డారు.
also read:యూపీ సీఎం యోగి ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్: కేసు నమోదు
తమకు సహాయం చేయాలని బాధితులు భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ వీడియోలో ఉన్న వారిలో 30 మంది నేపాలు వాసులున్నారు. ఐదుగురు మాత్రం ఇక్కడి నుండి బయటపడ్డారు. ఆర్మీ సహాయకుల పేరుతో తమను మోసం చేశారని బాధితులు చెప్పారు.కానీ ఉక్రెయిన్ యుద్ధంలో తాము ముందు వరుసలో నిలబడి పోరాటం చేయాల్సి వస్తుందని బాధితుడు ఒకరు వీడియోలో పేర్కొన్నారు.