శరీరంలో ఈ భాగం ఉబ్బినట్లు కనిపిస్తుందా.? ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లే..
మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా.. ఇటీవల ఫ్యాటీ లివర్ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ సమస్యను ముందుగా గుర్తించే సరైన చికిత్స తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్యను ముందుగానే పసిగట్టే లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో, తీసుకున్న ఆహారం జీర్ణం కావడంలో లివర్‌దే కీలక పాత్ర. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉంచడానికి కూడా లివర్ ఉపయోగపడుతుంది. ఇలా శరీరంలో కీలక పాత్ర పోషించే లివర్‌కు ఇటీవల కొవ్వు సమస్య ఎక్కువుతోంది. ముఖ్యంగా యువత ఫ్యాటీ లివర్ బారిన ఎక్కువగా పడుతున్నారు. కొన్ని లక్షణాల ఆధారంగా ఫ్యాటీ లివర్ సమస్యను ముందుగానే గుర్తించే వైద్యులను సంప్రదిస్తే సమస్య తీవ్రత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని లక్షణాలు ఏంటంటే..
ముఖం ఉబ్బినట్లు..
శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడితే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వారిలో ముఖం ఉబ్బే అవకాశం 30 శాతం అధికంగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇంతకీ ఫ్యాటీ లివర్ సమస్యకు ముఖం ఉబ్బడానికి సంబంధం ఏంటనే ఆలోచిస్తున్నారు కదూ!
సాధారణంగా ఫ్యాటీ లివరస్ సమస్యతో బాధపడే వారిలో లివర్ అల్బుమిన్ అనే ప్రోటీన్‌ను తగినంతగా ఉత్పత్తి చేయదు. ఈ అల్బుమిన్ రక్తంలో ద్రవాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. శరీరంలో అల్బుమిన్ ప్రోటీన్ సరిపడ లేకపోతే.. ద్రవం రక్తనాళాల నుంచి కణజాలంలోకి లీక్ అవుతుంది. దీంతో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. అందుకే ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
దురదగా ఉన్నా..
దురద కూడా ఫ్యాటీ లివర్ సమస్యకు మరో లక్షణంగా చెప్పొచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలంగా ముఖంపై దురదగా ఉంటే ఫ్యాటీ లివర్ లక్షణంగా భావించాలి. ఇక చర్మంపై ఎలర్జీ ఎక్కువగా ఉన్నా అది ఫ్యాటీ లివర్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
దద్దుర్లు..
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారిలో కనిపించే మరో ప్రధాన లక్షణం చర్మంపై దద్దుర్లు రావడం. చర్మంపై అక్కడక్కడ అకారణంగా దద్దుర్లు కనిపిస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు.
సాధారణంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు శరీరం కొన్ని పోషకాలను సమర్థవంతంగా గ్రహించలేదు. ఈ కారనంగానే చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
చర్మం కందినట్లు..
కొందరికి చర్మం కంది పోయినట్లు కనిపిస్తుంది ఇది కూడా ఫ్యాటీ లివర్‌కు సంకేతంగా భావించాలి. చర్మం బాగా ఎరుపు రంగులోకి మారినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నల్లగా మారడం
మెడ దగ్గర చర్మం నల్లగా మారడం, చర్మంపై మడతలు ఏర్పడడం వంటివి కూడా ఫ్యాటీ లివర్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఇది మీ శరీరంలో అదనపు ఇన్సులిన్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ కారణంగానే చర్మంపై ఇలాంటి మార్పులు కనిపిస్తాయి.
కామెర్లు..
కామెర్లు కూడా ఫ్యాటీ లివర్ ఉందని చెప్పేందుకు సంకేతం. చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారితే అది ఫ్యాటీ లివర్ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. లివర్ పనితీరుల తేడా వస్తే శరీరంలో బైలిరుబిన్ అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో ఎక్కువగా పేరుకుపోతే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
నోట్: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యం విషయంలో ఏవైనా సందేహాలున్నా, సమస్యలున్నా వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడమే మంచిది.