ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచడంతో పాటు చాలా సమస్యలను దూరం చేస్తుంది. ధ్యానం చేయడానికి గంటలకొద్దీ సమయం అవసరం లేదంటున్నారు నిపుణులు. ప్రతిరోజు 5 నిమిషాలపాటు ధ్యానం చేస్తే చాలా లాభాలున్నాయని చెబుతున్నారు. మరి ధ్యానం వల్ల కలిగే లాభాలేంటో చూద్దామా..  

ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ చాలామంది గంటల తరబడి కూర్చొని ధ్యానం చేసే తీరిక, ఓపిక లేదంటారు. కానీ ధ్యానం కోసం గంటలు కేటాయించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. రోజూ 5 నిమిషాలు ధ్యానం చేస్తే చాలు. మానసిక, శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.

రోజూ ధ్యానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ధ్యానం.. ప్రాచీన సంప్రదాయాల్లో ఉన్న ఆధ్యాత్మిక అభ్యాసం. రోజూ 5 నిమిషాలు ధ్యానం చేస్తే మనసు, శరీరం, ఆత్మ సమన్వయం అవుతాయి. శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. ఆత్మతో లోతైన సంబంధం ఏర్పడుతుంది.

5 నిమిషాల ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు

• ధ్యానం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2 నెలల పాటు రోజూ 5 నిమిషాలు ధ్యానం చేసిన వారిలో రోగనిరోధక శక్తి పెరిగింది. ఇన్ఫ్లమేషన్ తగ్గడం, వ్యాధిగ్రస్త కణాలు మృతి చెందడం, క్యాన్సర్ నుంచి రక్షణ కలిగించే జన్యువులు చురుగ్గా పనిచేయడం మొదలయ్యాయి.

• మంచి నిద్రకు ధ్యానం ఉపయోగపడుతుంది. 6 రోజుల్లోనే ధ్యానం ప్రభావం కనిపిస్తుంది. రోజూ ధ్యానం చేస్తే నిద్రలేమి, అలసట, డిప్రెషన్ తగ్గుతాయని పరిశోధకులు గమనించారు.

• ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది. నొప్పిని నియంత్రిస్తుంది. తలనొప్పి, నడుంనొప్పి, ఛాతినొప్పి, కడుపునొప్పి వంటివి ఉన్నవారికి ధ్యానం ఉపయోగపడుతుంది.

• ధ్యానం రక్తపోటును తగ్గిస్తుంది. రోజూ ధ్యానం చేస్తే మాత్రలు వేసుకోవడం కంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

• ధ్యానం మెదడును చురుగ్గా ఉంచడానికి సహాయపడుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఏకాగ్రత పెంచుతుంది.

• ధ్యానం నిర్ణయాలు తీసుకునే ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌ను బలపరుస్తుంది.

• ధ్యానం.. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను చురుగ్గా చేస్తుంది.

5 నిమిషాల ధ్యానం ఎలా చేయాలి? :

ధ్యానం కోసం ముందుగా 5 నిమిషాల టైం కేటాయించుకోవాలి. ప్రశాంతమైన, శుభ్రమైన చోట కూర్చోవాలి. కళ్లు మూసుకోవాలి. శ్వాసపై దృష్టి పెట్టాలి. ఓం లేదా శాంతి మంత్రం జపించాలి. ఈ ధ్యానాన్ని కేవలం ఉదయమే కాదు మధ్యాహ్నం, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. స్ట్రెస్ అనిపించినప్పుడు 5 నిమిషాలపాటు మెడిటేషన్ చేస్తే.. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెగెటివ్ ఆలోచనలు దూరం అవుతాయి.