Walking: బరువు ఈజీగా తగ్గాలంటే.. రోజుకు ఎన్నివేల అడుగులు నడవాలో తెలుసా?
వాకింగ్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే మంచిది?
వాకింగ్ అన్ని విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే వ్యాయామం. ఎవరైనా సరే దీన్ని ఈజీగా చేయచ్చు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాసేపు నడిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. మనసుకు ప్రశాంతత రెండూ దక్కుతాయి. అయితే నిపుణుల ప్రకారం రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే మంచిది? తదితర విషయాలు మీకోసం. ఓసారి చూసేయండి.
7 వేల అడుగులు
ప్రస్తుతం చాలామంది 10వేల అడుగుల నడక లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒక వ్యక్తి ప్రతిరోజు 7వేల అడుగులు నడిచినా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 7వేల అడుగులు నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు వాకింగ్ కీళ్లు, కండరాల ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది.
మంచి నిద్రకు..
ఆరోగ్యంగా ఉండడానికి నాణ్యమైన నిద్ర చాలా అవసరం. వాకింగ్.. శరీరానికి అవసరమైన కదలిక, శక్తి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు 7 వేల అడుగులు నడవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ నియంత్రణలో...
వాకింగ్… డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులను నియంత్రించడంతో పాటు రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది . టైప్ 2 డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా నడక సహాయపడుతుంది. రోజూ 7 వేల అడుగులు నడవలేని వారు 5వేల అడుగులు నడిచినా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్లు ఆహారం తిన్న తర్వాత నడవడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయని సూచిస్తున్నారు.