Fashion Tips: ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సన్నగా, పొడుగ్గా కనిపించొచ్చు..!
కొన్ని రంగులు.. పొడువుగా ఉన్నట్లుగా చూపిస్తాయి. అందుకే.. ఎంచుకునే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పొడవుగా కనిపించాలంటే..
అందంగా కనిపించాలనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. తాము అదంగా కనిపిచాలని కోరుకుంటారు. దాని కోసం చాలా రకాల ట్రెండీ దుస్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే.. కొంచెం బొద్దుగా ఉండేవారికి అన్ని దుస్తులు సూటవ్వవు. సరైన మోడల్ డ్రెస్, సరైన రంగు సెలక్ట్ చేసుకోకపోతే.. ఇంకా కొంచెం లావుగా కనపడతారు. అలా కాకుండా.. సన్నగా, పొడవుగా కనిపించాలంటే.. మన డ్రెస్సింగ్ స్టైల్ ని మార్చుకోవాలి. ఎలాంటి దుస్తులు వేసుకుంటే.. పొడవుగా కనపడతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ముదురు రంగులు..
మనం వేసుకునే రంగులు కూడా మన లుక్ ని మార్చేస్తాయి. కొన్ని రంగుల దుస్తులు మన ఉన్న ఎత్తు కంటే తక్కువగా, లావుగా కనిపించేలా చేస్తాయి. అదే.. కొన్ని రంగులు.. పొడువుగా ఉన్నట్లుగా చూపిస్తాయి. అందుకే.. ఎంచుకునే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా నలుపు , నీలం వంటి రంగులు మిమ్మల్ని సన్నగా కనిపించేలా చేస్తాయి. పైన, కిందా ఒకే రంగులు వేసుకోవడం వల్ల కూడా మీరు పొడవుగా కనిపించే అవకాశం ఉంటుంది. ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం మీరు కార్డ్ సెట్స్ ఎంచుకోవాలి. అవి మీ ఎత్తు ఎక్కువగా ఉన్నట్లు చూపించడంలో సహాయం చేస్తాయి.
ఎత్తుగా ఉండే ప్యాంటు ధరించండి:
ఎత్తుగా ఉండే ప్యాంటు లేదా స్కర్టులు ధరించడం వల్ల మీ కాళ్ళు పొడవుగా కనిపిస్తాయి. ఇది మీ నడుమును బాగా ఆకృతి చేస్తుంది. మీ శరీరాన్ని సమతుల్యం చేస్తుంది, మిమ్మల్ని సన్నగా కనిపించేలా చేస్తుంది.
నిలువు చారలు ఉన్న దుస్తులను ఎంచుకోండి:
నిలువు చారలు ఉన్న దుస్తులు మిమ్మల్ని పొడవుగా కనిపిస్తాయి. మీరు చీరలు, కుర్తాలు లేదా నిలువు చారలు ఉన్న దుస్తులు ధరించవచ్చు. ముఖ్యంగా ముదురు రంగులను ఎంచుకోండి.అప్పుడు ఆటోమెటిక్ గా ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తారు.
వదులుగా ఉండే దుస్తులు వద్దు..
ఫిట్ గా, బాడీకి సూటయ్యే దుస్తులు..
చాలా బిగుతుగా లేదా చాలా వదులుగా ఉండే దుస్తులు లుక్ పోగొడతాయి. దానికి బదులు కరెక్ట్ గా సూటయ్యే దుస్తులు వేసుకోవడం మంచిది. అలా అని మరీ బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల మీరు మరింత లావుగా కనిపిస్తారు. కాబట్టి.. బిగుతుగా, వదులుగా కాకుండా.. కరెక్ట్ గా సూటయ్యే దుస్తులు ధరించాలి.
V-నెక్‌లైన్ పొడవాటి నెక్‌లైన్ దుస్తులు:
V-నెక్‌లైన్ లేదా పొడవాటి నెక్‌లైన్ ఉన్న దుస్తులు మీ మెడను పొడవుగా కనిపించేలా చేస్తాయి. మిమ్మల్ని పొడవుగా కనిపించేలా చేస్తాయి. ఇది మీ ముఖాన్ని కూడా సన్నగా చేస్తుంది. కాబట్టి, U-నెక్ దుస్తులు ధరించకుండా , V-నెక్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి.
మీరు హై హీల్స్ ధరించవచ్చు:
సాధారణ ఫ్లాట్‌లను ధరించడానికి బదులుగా, మీ కాళ్లను పొడుగ్గా కనిపించేలా చేయడానికి, మిమ్మల్ని పొడవుగా కనిపించేలా చేయడానికి హై హీల్స్ లేదా వెడ్జ్‌లను ధరించండి. పొడవైన కాళ్ళు మీ శరీరాన్ని సన్నగా , పొడవుగా కనిపించేలా చేస్తాయి.
మోనోక్రోమ్ లుక్:
మోనోక్రోమ్ లుక్ ని ఫాలో అయితే కూడా మీరు వీలైనంత వరకు సన్నగా, పొడవుగా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే.. టాప్, బాటమ్ రెండూ ఒకే రంగు లేదా.. ఒక డిజైన్ లో ఉండాలి. ఇవి మీ ఎత్తును పెంచుతాయి.
లేయరింగ్ చేయద్దు..
డ్రెస్ లేయరింగ్ అంటే మీరు మొదట టాప్ ధరించి, దానిపై చొక్కా లేదా జాకెట్ వేయడమే. చాలా పొరలు మీ శరీరాన్ని బరువుగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి, సన్నగా కనిపించడానికి సరళమైన, సాదా దుస్తులను ఎంచుకోండి.
సరైన దుస్తుల ఎంపిక మీ రూపాన్ని మార్చగలదు. పైన పేర్కొన్న ఈ ఫ్యాషన్ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు పొడవుగా , సన్నగా కనిపించవచ్చు. మహిళలు తమ దుస్తులను రంగు , ఫిట్ పరంగా జాగ్రత్తగా ఎంచుకోవడం ముఖ్యం.