Hair Care: చలికాలంలో జుట్టు రాలద్దొంటే... ఈ ఒక్క నూనె రాస్తే చాలు
Hair Care: చలికాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఎన్ని రకాల నూనెలు, షాంపూలు మార్చినా కూడా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం లేదా? అయితే కేవలం ఒకే ఒక్క నూనె రాస్తే చాలు.

Hair Care
జుట్టు పెరగడం ఆగిపోవడం, పలచగా మారడం, మెరుపు కోల్పోవడం వంటి సమస్యలు చలికాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి. చలి, పొడి వాతావరణం వల్ల తలలో తేమ తగ్గిపోయి జుట్టు బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సరైన పోషణలు ఉన్ననూనెను ఉపయోగిస్తే... జుట్టు ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, జుట్టు కుదుళ్లను బలంగా చేయాలన్నా, సహజమైన మెరుపును పొందాలన్నా... ఒక ప్రత్యేక ఆయుర్వేద హెయిర్ ఆయిల్ తప్పక ప్రయత్నించాలి.
ఆయుర్వేద నూనె జుట్టు కుదుళ్ల నుంచి కొన వరకు లోతుగా పోషిస్తుంది. సహజ పదార్థాలతో తయారయ్యే ఈ నూనె తల చర్మానికి అవసరమైన పోషకాలను అందించి.. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. దీని వల్ల కొత్త జుట్టు పెరగడానికి కారణం అవుతుంది. మరి.. ఈ ఆయుర్వేద నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం....
ఆయుర్వేద నూనె తయారీకి కావాల్సినవి
1.కొబ్బరి నూనె...
ఈ నూనె జుట్టుకు అద్భుతమైన బేస్ ఆయిల్ గా పని చేస్తుంది. జుట్టులోని ప్రోటీన్ నష్టాన్ని తగ్గించి, లోతుగా తేమను అందిస్తుంది. పొడి జుట్టును మృదువుగా మారుస్తుంది. దీని వల్ల హెయిర్ డ్యామేజ్ ఉండదు.
ఆముదం నూనె
రిసినోలిక్ ఆమ్లం అధికంగా ఉండే ఆముదం నూనె జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది కుదుళ్లను బలపరచి జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఆవ నూనె
ఈ నూనె తల చర్మంలో రక్త ప్రసరణను పెంచుతుంది. రక్త ప్రసరణ మెరుగవడం వల్ల జుట్టు కుదుళ్లకు సరైన పోషణ అందుతుంది. ఫలితంగా కొత్త జుట్టు పెరుగుతుంది.
కలోంజి గింజలు (నల్ల జీలకర్ర)
కలోంజి గింజల్లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తల చర్మంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, చుండ్రు వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
ఉసిరికాయ (ఆమ్లా)
విటమిన్ C , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఉసిరి జుట్టును నల్లగా, బలంగా , మెరిసేలా చేస్తుంది. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య ఉండదు.
నూనె ఎలా తయారు చేయాలి?
మెంతి గింజలు
ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లంతో నిండిన మెంతులు జుట్టు బలహీనతను తగ్గించి చుండ్రును నియంత్రిస్తాయి. జుట్టుకు సహజమైన మృదుత్వం ఇస్తాయి.
ఉల్లిపాయ
సల్ఫర్ అధికంగా ఉండే ఉల్లిపాయలు తల చర్మంలో రక్త ప్రసరణను పెంచి నిద్రావస్థలో ఉన్న జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. దీంతో జుట్టు పెరుగుదల గణనీయంగా మెరుగవుతుంది.
ఈ అన్ని పదార్థాలను సరైన మోతాదులో కలిపి నూనె తయారు చేసి వారానికి 2–3 సార్లు తల మసాజ్ చేస్తే, శీతాకాలంలో కూడా జుట్టు బలంగా, పొడవుగా , మెరిసేలా మారుతుంది.

