Face Glow: ఇదొక్కటి రాసినా ముఖం కాంతివంతంగా మెరవడం పక్కా..!
Face Glow: ఇంట్లో అందుబాటులో ఉన్న పదార్థాలతో చేసే ఫేస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ చికిత్స చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, సహజ కాంతిని తెస్తుంది. మరీ ముఖ్యంగా బంగాళదుంపను వాడి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

Face Pack
అందమైన, కాంతివంతమైన చర్మం పొందాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దాని కోసమే దాదాపు అందరూ ఖరీదైన క్రీములు, సీరమ్స్ వాడుతూ ఉంటారు. కానీ.. ఈ రసాయనాలు ఉండే ఉత్పత్తులు వాడటం వల్ల స్కిన్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, వంట గదిలో లభించే సహజ పదార్థాలతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....
ఇంట్లోనే ఫేషియల్ గ్లో పెంచుకోవడానికి వాడాల్సినవి ఇవే..
నల్ల మచ్చలు తగ్గింపు... బంగాళదుంప రసం, నిమ్మరసం కలయిక పిగ్మెంటేషన్, నల్లమచ్చలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
వెంటనే ముఖానికి మెరుపు రావాలంటే... కాఫీ, సెనగ పిండి చర్మంలోని మృత కణాలను తొలగించి... చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ఈ రెండూ కలిపి ముఖానికి రాస్తే... చాలా తక్కువ సమయంలోనే ముఖం మెరుస్తూ కనపడుతుంది.
లోతైన పోషణ: పెరుగు , కొబ్బరి నూనె చర్మానికి తీవ్ర హైడ్రేషన్‌ను అందిస్తూ కణాలను పునరుద్ధరిస్తాయి, ముఖ్యంగా చలికాలంలో వచ్చే స్కిన్ సమస్యలకు చెక్ పెడతాయి.
వీటిని ముఖానికి ఎలా వాడాలంటే...
ఒక చిన్న గిన్నెలో బంగాళదుంప రసం, నిమ్మరసం, పెరుగు, కొబ్బరి నూనె, కాఫీ, సెనగ పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. దానికంటే ముందు ఒకసారి ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసిన తర్వాత 15నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వారానికి రెండుసార్లు దీనిని వాడటం వల్ల.. మీ అందం రెట్టింపు అవుతుంది. మీరు యవ్వనంగా కూడా కనపడతారు.

