Beauty Tips: శనగపిండిలో నెయ్యి కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుంది? డాక్టర్లు ఏమంటున్నారు?
Beauty Tips: చర్మ సౌందర్యానికి శెనగ పిండి, నెయ్యి చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ, ఇవి నిజంగా మన చర్మానికి మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం....

Beauty Tips
వయసు పెరుగుతున్నా కూడా యవ్వనంగా, అందంగా కనిపించాలని చాలా మంది ఆశపడుతుంటారు. పూర్వం నుంచి శనగపిండిని చర్మ సౌందర్యంలో భాగంగా వాడుతూనే వచ్చారు. ఇప్పటికీ.. చాలా మంది ముఖానికి రెగ్యులర్ గా శనగ పిండిని ముఖానికి పూసేస్తూ ఉంటారు. కొందరు అయితే.. ఏకంగా సబ్బుకు బదులు... ఇప్పటికీ దీనినే వాడుతున్నారు.ముఖ్యంగా శనగ పిండిలో నెయ్యి లేదా పాలు, పాలమీద మీగడ కలిపి ముఖానికి రాస్తూ ఉంటారు. కానీ.. అసలు శనగ పిండిలో నెయ్యి కలిపి ముఖానికి రాయడం మంచిదేనా? ఇది అన్ని రకాల చర్మాల వారికి సూట్ అవుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం....
శనగపిండి, నెయ్యి.. ఫేస్ మాస్క్
శనగ పిండి, నెయ్యితో తయారు చేసిన ఫేస్ మాస్క్ ను మీ ముఖానికి అప్లై చేయడం ముఖానికి చాలా సురక్షితం. ఈ రెండూ కలిపి ముఖానికి రాయడం వల్ల మీ చర్మం చాలా హైడ్రేట్ అవుతుంది. చర్మానికి మంచి పోషణ లభిస్తుంది. ముఖం అందంగా కూడా కనపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు.
నెయ్యిలో చర్మాన్ని తేమగా ఉంచే ఫ్యాట్స్ ఉంటాయి. శనగ పిండి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. మొటిమల సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు.. చర్మపు రంగును కూడా మెరుగుపరుస్తుంది.
ఎవరు వాడకూడదు..?
నెయ్యి, శనగ పిండి ఫేస్ మాస్క్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ , కొంత మంది మాత్రం వాటిని వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, శనగ పిండి చాలా పొడిగా ఉంటుంది. కాబట్టి, పొడి చర్మం ఉన్నవారు దీనిని వాడకూడదు. మీ స్కిన్ టైప్ ని బట్టి... మీ ముఖానికి ఈ పిండిని వాడాలి.
అలెర్జీలు...
పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు నెయ్యి, శనగ పిండి ఫేస్ మాస్క్ వాడకూడదు. అలెర్జీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి... ముందుగా ముఖానికి వాడే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు దీనిని వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
చర్మ సమస్యలు ఉన్నవారు...
ముందుగానే చర్మ సమస్యలు ఉన్నవారు చర్మంపై నెయ్యి , శనగపిండిని వాడకూడదు. తామర, సోరియాసిస్ ఉన్నవారు ముఖానికి నెయ్యి పూయకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి, నెయ్యి పూయడం వల్ల మలాసెజియా ఫర్ఫర్ వంటి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఇది చర్మ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
మొటిమల సమస్యలు ఉన్నవారు...
ఇప్పటికే మొటిమలతో బాధపడేవారు నెయ్యి , శనగపిండి ఫేస్ ప్యాక్ వాడకుండా ఉండాలి. నెయ్యి ఒక జిడ్డుగల పదార్థం. మీ చర్మంపై ఇప్పటికే మొటిమలు ఉండి, నెయ్యి , శనగపిండి ఫేస్ మాస్క్ వేసుకుంటే, అది రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. దీని వల్ల మొటిమలు మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది
మీరు నెయ్యి , శనగపిండి ఫేస్ ప్యాక్ ఎప్పుడు అప్లై చేయాలి?
మీ ఫేస్ డల్ గా ఉందని మీకు అనిపించినప్పుడు, మీ చర్మ రంగును మెరుగుపరచడానికి నెయ్యి , శనగపిండితో చేసిన ఫేస్ ప్యాక్ అప్లై చేయవచ్చు. అయితే, దీనిని వారానికి రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలి. ఇది చాలా మంది ప్రకాశవంతమైన చర్మం కోసం ఉపయోగించే చాలా సాధారణ ఆయుర్వేద గృహ నివారణ. నెయ్యిలో విటమిన్లు A, D , E లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, లోతుగా శుభ్రపరుస్తుంది. ముఖంపై పేరుకుపోయిన మురికిని కూడా తొలగిస్తుంది.

