Face Glow: ఖరీదైన క్రీములతో పనిలేదు.. ఈ నాలుగు గింజలు తిన్నా.. మీ వయసు తగ్గుతుంది..!
ఈ గింజలు ఆరోగ్యం మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయి. ఈ చిన్న గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాదు.. చర్మాన్ని హైడ్రేటెడ్ గా కూడా మారుస్తాయి.

seeds
ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం మాత్రమే కాదు..అందం కోసం తాపత్రయ పడేవారు కూడా చాలా మందే ఉన్నారు. అందానికి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తమ వయసు పెరుగుతున్నా కూడా... అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు.దాని కోసం.. ఖరీదైన క్రీములు వాడటం, రెగ్యులర్ గా స్కిన్ కేర్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే, ఖరీదైన క్రీములు రాయాల్సిన అవసరం లేకపోయినా కూడా మనం మన అందాన్ని పెంచుకోవచ్చు. వయసు తగ్గించుకోవచ్చు. దాని కోసం రోజూ క్రమం తప్పకుండా నాలుగు గింజలు తింటే చాలు. మరి ఏ గింజలు తింటే మన అందం పెరుగుతుందో తెలుసుకుందామా...
మనకు మార్కెట్లో గింజలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని ఆరోగ్యం కోసం చాలా మంది తీసుకుంటూనే ఉంటారు. అయితే.. ఈ గింజలు ఆరోగ్యం మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయి. ఈ చిన్న గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడమే కాదు.. చర్మాన్ని హైడ్రేటెడ్ గా కూడా మారుస్తాయి.
చర్మాన్ని అందంగా మార్చే సీడ్స్ ...
1.అవిసె గింజలు...
అవిసె గింజలు మనకు మార్కెట్లో చాలా ఈజీగా లభిస్తాయి. వీటి ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎవరైనా కొనుక్కోగల స్టాయిలోనే ఉంటాయి. ఈ గింజలు తినడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని పొడి బారడాన్ని తగ్గిస్తుంది. చాలా రకాల చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
ఈ అవిసె గింజలను ఎలా తినాలి..?
ఈ అవిసెగింజలను రోజూ ఒక స్పూన్ తిన్నా చాలు. మీరు వీటిని స్మూతీలో , ఓట్స్ లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు. గింజలు తినడం కష్టంగా అనిపిస్తే.. పొడి చేసుకొని అయినా తినవచ్చు. లేదంటే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఈ గింజల పొడి కలిపి తీసుకోవచ్చు.
2. చియా సీడ్స్...
చియా సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది బరువు తగ్గడానికి మాత్రమే చియా సీడ్స్ వాడాలి అనుకుంటారు. కానీ.. మన చర్మ సౌందర్యం పెంచడానికి కూడా ఇవి బాగా సహాయపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల మన చర్మం చాలా హైడ్రేటెడ్ గా మారుతుంది. తేమగా కూడా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుంచి కూడా రక్షిస్తాయి.
ఎలా తినాలి
రాత్రిపూట నీటిలో లేదా పాలలో నానబెట్టి ఉదయం అల్పాహారంలో తినాలి.
పుడ్డింగ్‌లు, స్మూతీలు లేదా పండ్ల సలాడ్‌లలో జోడించండి.
3.గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కూడా అందం పెరుగుతుంది.ఈ గింజల్లో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే జింక్ సమృద్ధిగా ఉంటుంది.చర్మాన్ని ఆరోగ్యంగా , బిగుతుగా ఉంచుతుంది. ఇవి తింటే ముఖంపై ముడతలు రావు, యవ్వనంగా కనపడతారు.
ఎలా తినాలి
రోస్ట్ చేసి స్నాక్‌గా తినండి.
సలాడ్‌లు లేదా సూప్‌లలో టాపింగ్‌గా వడ్డించండి.
పొద్దు తిరుగుడు విత్తనాలు...
సన్‌ఫ్లవర్ విత్తనాలు తినడం వల్ల కూడా మన చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ గింజల్లో విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది, ఇది చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది.చర్మాన్ని మృదువుగా , యవ్వనంగా ఉంచుతుంది. ఈ గింజలను మనం పెరుగు, స్మూతీలలో కలుపుకొని తినవచ్చు.
నువ్వులు
నువ్వులు తినడం వల్ల చర్మం అందంగా మారుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు , కాల్షియం చర్మానికి మెరుపు ఇస్తాయి.
ఈ నువ్వులు.. శీతాకాలంలో చర్మం పొడిబారడం తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ నువ్వులను బెల్లంతో కలిపి తీసుకోవచ్చు. లేదంటే సలాడ్, కూరగాయలు, చట్నీలతో కలిపి తీసుకోవచ్చు.