Periods: మందులతో పని లేదు, ఇదొక్కటి తిన్నా పీరియడ్స్ ముందుగానే వస్తాయి..!
పీరియడ్స్ ముందు వచ్చేలా మందులు వేసుకోవడం, ఇంజక్షన్స్ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొందరు.. ఆలస్యం అవ్వాలని మందులు వాడుతూ ఉంటారు.

పీరియడ్స్ ముందుగానే రావాలంటే..
మహిళలకు పీరియడ్స్ ప్రతి నెలా వస్తూనే ఉంటాయి. ఈ పీరియడ్స్ సమయంలో ఎలాంటి పని చేయాలని అనిపించదు. ఆ నొప్పితో ఇంట్లో పనులు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇక.. మన హిందూ సంప్రదాయాల ప్రకారం.. పీరియడ్స్ సమయంలో ఎలాంటి శుభకార్యాలకు హాజరు కాకూడదనే నమ్మకం ఉంటుంది. పండగ వచ్చినా, ఏదైనా పెళ్లికి వెళ్లాలన్నా.. ఈ సమయంలో వెళ్లకుండా దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో చాలా మంది అమ్మాయిలు.. ఇలా అడ్డు రాకూడదని.. మందులు వాడుతూ ఉంటారు. పీరియడ్స్ ముందు వచ్చేలా మందులు వేసుకోవడం, ఇంజక్షన్స్ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొందరు.. ఆలస్యం అవ్వాలని మందులు వాడుతూ ఉంటారు. కానీ, ఈ మందులు మన ఆరోగ్యాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తులో చాలా రకాల ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. అందుకే, ఎలాంటి ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్లు లేకుండా.. కేవలం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల పీరియడ్స్ ముందే వచ్చేలా చేయవచ్చు. దాని వల్ల.. మీరు అనుకున్న శుభకార్యం కి ఎలాంటి సంకోచం లేకుండా వెళ్లొచ్చు. ఆహారంలో మార్పులు మాత్రమే చేస్తున్నాం కాబట్టి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావు. మరి, పీరియడ్స్ ముందుగా రావడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
బెస్ట్ హోం రెమిడీ..
ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీ పీరియడ్స్ త్వరగా వచ్చేలా చేసే ఒక సూపర్ హోం రెమెడీని చూద్దాం. దీనికి మీకు కావలసింది తేనె, బెల్లం, నల్ల నువ్వులు. ఈ నల్ల నువ్వులు శరీరంలో వేడిని సృష్టించి, మీకు పీరియడ్స్ త్వరగా వచ్చేలా చేసే శక్తిని కలిగి ఉంటాయి. తరువాత, బెల్లం, ఇది కూడా మీ శరీరంలో వేడిని సృష్టిస్తుంది.
ఎలా తయారు చేయాలి?
ఒక చెంచా నల్ల నువ్వులను తీసుకొని మిక్సర్ జార్‌లో వేసి, ఒక చెంచా బెల్లం వేసి మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు దానికి ఒక చెంచా తేనె వేసి కలపండి. అంతే.. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే.. మీ పీరియడ్స్ కచ్చితంగా ముందే వచ్చేస్తాయి.
ఎలా తినాలి?
ఈ నల్ల నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ఈ ఔషధాన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో , సాయంత్రం మీ పీరియడ్స్ ప్రారంభానికి ఒక వారం ముందు తీసుకోవాలి. ఉదాహరణకు, మీ పీరియడ్స్ వచ్చే శుక్రవారం ప్రారంభమైతే, సోమవారం నుండి కనీసం మూడు రోజుల ముందు మీరు దీన్ని తీసుకోవడం ప్రారంభించవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను ప్రేరేపిస్తుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీ పీరియడ్స్ వెంటనే వచ్చేలా చేస్తుంది. ట్యాబ్లెట్స్ కి బదులు వీటిని వాడటం మంచిది.
నల్ల నువ్వులతో ప్రయోజనాలు..
చాలా మంది అమ్మాయిలు క్రమ రహిత పీరియడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ నల్ల నువ్వులు చాలా బాగా సహాయపడతాయి.ఈ సమస్యలకు సహజ పరిష్కారాలను అందించడంలో నల్ల నువ్వులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. నల్ల నువ్వులలో ఉండే పోషకాలు , ఔషధ గుణాలు పీరియడ్స్ సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి.
నల్ల నువ్వులో పోషకాలు..
నల్ల నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఋతుస్రావం సమయంలో మహిళలు రక్తాన్ని కోల్పోతారు, ఇది శరీరంలో ఐరన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. మీ ఆహారంలో నల్ల నువ్వులను చేర్చుకోవడం వల్ల మీ ఐరన్ స్థాయిలు మెరుగుపడతాయి.
నల్ల నువ్వులు తింటే కలిగే లాభాలు..
హార్మోన్ల సమతుల్యత:
నల్ల నువ్వులలోని లిగ్నన్లు , ఫైటోఈస్ట్రోజెన్లు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి, ఇది క్రమరహిత ఋతుస్రావం, PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
పీరియడ్ నొప్పిని తగ్గిస్తుంది:
నల్ల నువ్వులలోని కాల్షియం, మెగ్నీషియం , ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఋతు నొప్పి , కడుపు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఉదర కండరాలను ఉపశమనం చేస్తుంది . నొప్పిని తగ్గిస్తుంది.