Face Glow: రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే, ముఖంలో గ్లో పెరగడం పక్కా..!
ఆయుర్వేదం ప్రకారం, కొన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకోవడం వల్ల సహజంగానే అందంగా మారతారు. ఇవి తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు రాకుండా ఆపగలం.

అందాన్ని పెంచుకోవాలంటే..
అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? వయసుతో సంబంధం లేకుండా యవ్వనంగా కనిపించాలనే అనుకుంటారు. దాని కోసం చాలా మంది ఖరీదైన క్రీములు పూసేస్తూ ఉంటారు. కానీ, మనం కేవలం కొన్ని డ్రింక్స్ ప్రతిరోజూ తాగడం వల్ల ముఖంలో కచ్చితంగా గ్లో వస్తుంది. యవ్వనంగా కూడా కనపడతారు. ఆయుర్వేదం ప్రకారం, కొన్ని సుగంధ ద్రవ్యాలను తీసుకోవడం వల్ల సహజంగానే అందంగా మారతారు. ఇవి తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు రాకుండా ఆపగలం. మరి, అవేంటి? వాటిని ఎలా తీసుకుంటే.. మన అందం పెరుగుతుందో తెలుసుకుందాం...
దాల్చిన చెక్క నీరు..
రాత్రి పడుకునే ముందు మీరు దాల్చిన చెక్క నీరు తాగొచ్చు. దీనిని తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్, ఫాలీ పెనాల్స్ ను అందిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రంలో సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు.. అందంగా కనపించేలా చేయడానికి సహాయపడుతుంది.
మెంతుల నీరు..
రాత్రి పడుకునే ముందు మీరు మెంతుల నీటిని తాగవచ్చు. మెంతుల నీరు తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు 1 గ్లాసు మెంతి నీరు తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరుగుతుంది. ఉబకాయం సమస్య అనేది ఉండదు. అంతేకాదు.. సహజంగా, యవ్వనంగా అందంగా కనిపించేలా చేస్తుంది.
జీలకర్ర నీరు
జీలకర్ర నీరు త్రాగడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. జీలకర్రకు సహజ జీర్ణ లక్షణాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజూ నీటితో కలిపి తాగితే, ఇది మీ చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రోజూ తాగితే, మీ స్కిన్ లో వచ్చే మార్పులు మీరే గమనించగలరు.
సోంపు వాటర్..
సోంపు గింజలను నీటిలో మరిగించి త్రాగడం మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీని కోసం, సోంపు గింజలను నీటిలో వేసి కొంత సమయం ఉంచండి. తరువాత, ఈ నీటిని బాగా వడకట్టి త్రాగండి. ఇది కడుపును చల్లబరుస్తుంది. మీకు మంచి నిద్ర కూడా వస్తుంది. ముఖంలో సహజంగా గ్లో కూడా వస్తుంది.