Beauty Tips: ఇలా చేస్తే..ఒక్కరోజులో మొటిమలు మాయం..!
ఇంట్లో లభించే కొన్ని హోం రెమిడీలు ప్రయత్నించడం వల్ల కేవలం ఒక్క రోజులోనే మొటిమలను తగ్గించవచ్చు.

మొటిమలకు ఈజీ పరిష్కారం..
ఈ కాలం అమ్మాయిలు చాలా మంది ముఖంపై మొటిమల సమస్యతో బాధపడుతున్నవారే. ఈ మొటిమలు ముఖ అందాన్ని మొత్తం పాడుచేస్తూ ఉంటాయి. ఇవి తగ్గాలని మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు పూసేస్తూ ఉంటారు. కానీ అవి కాస్త తగ్గించినా.. మచ్చలు మాత్రం అలానే ఉండిపోతాయి. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే.. ఇంట్లో లభించే కొన్ని హోం రెమిడీలు ప్రయత్నించడం వల్ల కేవలం ఒక్క రోజులోనే మొటిమలను తగ్గించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
హోం రెమిడీస్..
1.ఐస్ క్యూబ్స్ తో మసాజ్...
మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు.. కేవలం ఇంట్లో లభించే ఐస్ క్యూబ్స్ తో నెమ్మదిగా మసాజ్ చేయాలి. కనీసం 5 నిమిషాలు అయినా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల ఎరుపు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ తో కంప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగౌతుంది.
2. ఆస్ప్రిన్ పేస్ట్
రెండు ఆస్ప్రిన్ మాత్రలను నెమ్మదిగా పగలగొట్టి, కొన్ని చుక్కల నీటితో పేస్ట్‌లా తయారు చేయాలి. దీన్ని మొటిమపై అప్లై చేస్తే, అందులోని సాలిసిలిక్ ఆమ్లం మొటిమలోని నూనెను, మురికిని తొలగిస్తుంది. ఇది చాలా వరకు సమర్థవంతంగా పని చేస్తుంది.
వీటితో మొటిమలకు చెక్..
3. స్పాట్ ట్రీట్‌మెంట్ క్రీములు
సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ ఉండే స్పాట్ క్రీములు మొటిమలపై అప్లై చేయడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది, చర్మం శుభ్రంగా మారుతుంది. ఈ క్రీములు చర్మంపై వేడి లేకుండా ఉండేలా పనిచేస్తాయి, చర్మానికి భద్రతగా ఉంటాయి. ఫలితంగా మొటిమలు తగ్గే అవకాశం ఉంది.
4. హైడ్రోకొల్లాయిడ్ ప్యాచులు
ఇవి ప్రత్యేకమైన మెడికల్ స్టికర్లు. మీ ముఖంపై మొటిమ ఎక్కడ ఉంటే.. అక్కడ ఈ స్టిక్కర్ అంటించాలి. ఇలా రాత్రిపూట స్టిక్కర్ అంటిస్తే.. ఉదయాన్నేతగ్గడానికి అవకాశం ఉంటుంది. సహజంగా మొటిమలను ముట్టుకోవడ వల్ల అవి మరింత పెద్దవి అవుతాయి. ఈ స్టిక్కర్ వేయడం వల్ల మొటిమలను మనం తాకే అవకాశం ఉండదు. ఫలితంగా అవి తగ్గుముఖం పడతాయి.
టీట్రీ ఆయిల్ రాస్తే..
5. టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాస్త పామ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో కలిపి మొటిమపై తక్కువగా అప్లై చేయాలి. జిడ్డు చర్మం ఉన్నవారు ఎక్కువగా వాడటం మానుకోవడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మొటిమలను గిల్లడం లాంటివి చేయకూడు. అలా గిల్లితే పుండులాగా నల్లగా మారిపోతాయి.
6. సున్నితమైన క్లెన్సర్ మాత్రమే
బలమైన ఫేస్ వాష్‌లు లేదా స్క్రబ్బింగ్ ఉత్పత్తులను ఉపయోగించకుండా, తేలికపాటి, సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించండి. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తూ, సహజ pH స్థాయిని కాపాడుతుంది.
మొటిమలకు కలబంద..
8. తేనె + కలబంద గుణాలు
తేనె , అలొవెరా (కలబంద) మిశ్రమం మొటిమలపై అప్లై చేయండి. ఇవి సహజంగా చర్మానికి శాంతి ఇస్తాయి. శోథ నిరోధక లక్షణాలు ఉండడం వల్ల చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
ఒక్క రోజులో మొటిమను పూర్తిగా తగ్గించడం సాధ్యంకానప్పటికీ, పై చిట్కాలు ఉపయోగిస్తే గణనీయంగా దాని తీవ్రత తగ్గుతుంది. మీ చర్మం సహజంగా మృదువుగా ఆరోగ్యంగా మారుతుంది.