MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • క్యారెట్ ను ఇలా పెడితే మీ ముఖం బంగారంలా మెరిసిపోతుంది

క్యారెట్ ను ఇలా పెడితే మీ ముఖం బంగారంలా మెరిసిపోతుంది

క్యారెట్ ను తినడమే కాదు.. కాదు దీన్ని ముఖానికి కూడా పెట్టుకోవచ్చు. క్యారెట్ ఫేస్ ప్యాక్ వల్ల మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. అలాగే యవ్వనంగా ఉంటుంది. ఇందుకోసం క్యారెట్ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 24 2025, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్యారెట్ ఫేస్ ప్యాక్
Image Credit : Getty

క్యారెట్ ఫేస్ ప్యాక్

ఆడవారు అందంగా కనిపించేందుకు ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ కెమికల్స్ ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే సహజ పద్దతులను ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవి చర్మానికి ఎలాంటి హాని చేయవు. వీటితో చర్మాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు. ఇందుకోసం క్యారెట్ కూడా సహాయపడుతుంది. అవును క్యారెట్ ను ఉపయోగించి మీ ముఖాన్ని బంగారంలా మెరిసేలా చేయొచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
క్యారెట్ ఫేస్ ప్యాక్
Image Credit : stockPhoto

క్యారెట్ ఫేస్ ప్యాక్

క్యారెట్ చర్మానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎగా మారి చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది. అలాగే క్యారెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని చర్మంపై వృద్ధాప్య ఛాయలు, ముడతలు రాకుండా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ఎండకు నల్ల బడిన చర్మ రంగును తొలగిస్తుంది. అలాగే నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, మొటిమలు, డ్రై స్కిన్ వంటి సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం క్యారెట్ ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

34
క్యారెట్‌ను ఎలా ఉపయోగించాలి?
Image Credit : Getty

క్యారెట్‌ను ఎలా ఉపయోగించాలి?

క్యారెట్ ఫేస్ ప్యాక్: ఈ ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి ముందుగా క్యారెట్ ను బాగా ఉడికించండి. దీన్ని పేస్ట్ లా చేసి దీనిలో పెరుగు, తేనె వేసి బాగా కలిపి మెడకు, ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. దీంతో మీ స్కిన్ స్మూత్ గా, కాంతివంతంగా అవుతుంది. 

క్యారెట్ జ్యూస్ టోనర్: క్యారెట్ రసాన్ని కూడా మీ ముఖానికి పెట్టొచ్చు. ఇందుకోసం క్యారెట్ రసాన్ని తీసి వడకట్టి ఒక స్ప్రే బాటిల్ లో నింపి ఫ్రిజ్ లో పెట్టండి. దీన్ని ముఖం కడిగిన తర్వాత టోనర్ గా వాడితే సరిపోతుంది. 

44
క్యారెట్ ఫేస్ ప్యాక్
Image Credit : freepik

క్యారెట్ ఫేస్ ప్యాక్

వృద్ధాప్య ఛాయలు తగ్గడానికి:  క్యారెట్ ను ఉపయోగించి ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం క్యారెట్ రసాన్ని తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్, గుడ్డు పచ్చసొన వేసి కలపండి.దీన్ని ముఖానికి రాస్తే ముఖ చర్మం పొడిబారడం తగ్గుతుంది. ముడతలూ పోతాయి. 

క్యారెట్, శనగపిండి ఫేస్ ప్యాక్: ముఖానికి క్యారెట్, శెనగపిండి ఫేస్ ప్యాక్ ను కూడా వేసుకోవచ్చు. ఇందుకోసం క్యారెట్ రసంలో శెనగపిండిని వేసి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి రాస్తే చర్మ రంగు మెరుగుపడుతుంది. అలాగే అందంగా మెరిసిపోతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image2
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Related Stories
Recommended image1
ఆడవాళ్లు ఆరోగ్యం, అందం కోసం చేయాల్సిన పనులు ఇవి
Recommended image2
చపాతీలను రోజూ తింటే ఇన్ని సమస్యలొస్తాయా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved