Face Glow: ఓట్స్ లో ఇవి కలిపి రాస్తే.. ఒక్క రోజులోనే మార్పు, ఇన్ స్టాంట్ ఫేస్ గ్లో..!
Face Glow: కెమికల్స్ ఉండే క్రీములు, బయట కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. కానీ... మనం ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో స్కిన్ డ్యామేజ్ లేకుండా... అందంగా కనిపించేలా చేసుకోవచ్చు.

Face Glow
అందాన్ని పెంచుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ఈ కోరిక అమ్మాయిల్లో మరింత ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ కి అంత డిమాండ్ ఉంది. టీనేజ్ వయసు నుంచే ఆడ పిల్లలు.. ముఖానికి మేకప్ లు వేయడం మొదలు పెడుతున్నారు. అసలు.. ఎలాంటి క్రీమ్ రాయకుండా.. ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగుపెట్టడం లేదు. ఇలా కెమికల్స్ ఉండే క్రీములు, బయట కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. కానీ... మనం ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో స్కిన్ డ్యామేజ్ లేకుండా... అందంగా కనిపించేలా చేసుకోవచ్చు. మరి దాని కోసం ముఖానికి ఏం రాయాలో ఇప్పుడు చూద్దాం....
ఓట్స్ తో అందం...
ఓట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవే ఓట్స్ మన అందాన్ని కూడా పెంచుతాయి. ఓట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సహజంగా శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది. సహజమైన మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది.
1. ఓట్ మీల్, పెరుగు, పసుపు
ఓట్స్‌ను పొడిచేసి అందులో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. దీన్ని ముఖం, మెడపై రాసి 15–20 నిమిషాల పాటు ఉంచి ఆపై చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మంలోని మురికిని తొలగించి, సహజ కాంతిని తెస్తుంది. పసుపు యాంటీబాక్టీరియల్‌గా పనిచేసి మొటిమలను తగ్గిస్తుంది.
ఓట్స్ తో మెరిసే చర్మం...
2. ఓట్ మీల్, తేనె, పాలు
పొడి చర్మం ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. 2 టీస్పూన్ల ఓట్ మీల్ పొడికి 1 టీస్పూన్ తేనె, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయండి. దీన్ని 15 నిమిషాల పాటు అప్లై చేసి కడిగేయండి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా ఉంచుతుంది. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ సమస్యలను నివారిస్తాయి.
3. ఓట్ మీల్, నిమ్మరసం
జిడ్డుగల చర్మం ఉన్నవారికి ఓట్ మీల్ + నిమ్మరసం మంచి పరిష్కారం. నిమ్మరసం సహజ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి చర్మంలోని జిడ్డు తగ్గిస్తుంది. 15 నిమిషాలు అప్లై చేసి చల్లటి నీటితో కడిగేస్తే చర్మం ఫ్రెష్‌గా కనిపిస్తుంది. విటమిన్ C మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది.
4. ఓట్ మీల్, పాలు
అన్ని రకాల చర్మ రకాలకు సరిపోతుంది. ఓట్ మీల్ పొడిని పాల్లో కలిపి ప్యాక్ తయారు చేసి ముఖానికి రాయాలి. ఇది నల్లటి మచ్చలు, మొటిమల మరకలను తగ్గించి చర్మాన్ని స్మూత్‌గా చేస్తుంది.
ఏ స్కిన్ వారికి..?
ఓట్ మీల్ ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని సహజంగా శుభ్రపరచడమే కాకుండా, దానిని ప్రకాశవంతంగా ఉంచుతాయి. పొడి, జిడ్డు, సాధారణం – ఏ రకమైన చర్మమైనా సరే ఓట్ మీల్‌తో కలిపే పదార్థాన్ని బట్టి అందరికీ ఉపయోగపడుతుంది. వారంలో కనీసం రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్‌లు వాడితే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.