Skin Care: అందం పెరగాలంటే... ఇవి మాత్రం తినకూడదు..!
Skin Care: పోషకాహారాన్ని సరైన రీతిలో తీసుకుంటే... చర్మం కాంతివంతంగా మారుతుంది. కానీ, కొన్ని ఆహారాలు చర్మానికి చాలా హాని చేస్తాయి. అందుకే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో... ఎలాంటి ఆహారం తీసుకోకూడదో కూడా తెలుసుకోవాలి.

Skin Care
మన శరీరంలోని అతి పెద్ద అవయవం చర్మం. ఇది మ అందాన్ని మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మనం తీసుకునే ఆహారం నేరుగా చర్మంపై ప్రభావం చూపుతుంది. పోషకాహారాన్ని సరైన రీతిలో తీసుకుంటే... చర్మం కాంతివంతంగా మారుతుంది. కానీ, కొన్ని ఆహారాలు చర్మానికి చాలా హాని చేస్తాయి. అందుకే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో... ఎలాంటి ఆహారం తీసుకోకూడదో కూడా తెలుసుకోవాలి. మరి, ఎలాంటి ఫుడ్స్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....
1.చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు...
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా హాని చేస్తాయి. కేకులు, చాక్లెట్లు, పేస్ట్రీలు, కూల్‌డ్రింక్స్ వంటి అధిక చక్కెర ఉన్న పదార్థాలు చర్మానికి శత్రువులుగా మారతాయి. ఇవి శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియను వేగవంతం చేస్తాయి, దీని వలన చర్మంలోని కోలాజెన్ , ఎలాస్టిన్ దెబ్బతింటాయి. ఫలితంగా చర్మం ముడతలు పడటం, వయసు పైబడినట్లుగా కనిపిస్తారు.
2. ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలు
పికిల్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ స్నాక్స్‌లలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటిని నిల్వ చేస్తుంది, ఫలితంగా ముఖం ఉబ్బడం, కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం జరుగుతుంది. దీర్ఘకాలంలో చర్మం పొడిగా మారి సహజ కాంతి కోల్పోతుంది. దీని వల్ల వయసు మళ్లిన వారిలా కనిపిస్తారు.
3. నూనెలో వేయించిన ఆహారాలు
సమోసా, పకోడీ, ఫ్రెంచ్‌ఫ్రైస్ వంటి డీప్ ప్ఫ్రైడ్ ఫుడ్స్‌లో ట్రాన్స్‌ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచి చర్మ సమస్యలకు కారణమవుతాయి. మొటిమలు, చర్మపు ఎర్రటి మచ్చలు, ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి కావడం ఇవన్నీ ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల వస్తాయి.
4. అధిక కొవ్వు ఉన్న ఆహారాలు
బర్గర్లు, పిజ్జాలు, క్రీమ్స్, మాంసాహార పదార్థాల్లోని అధిక సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ చర్మానికి అనుకూలం కావు. ఇవి చర్మంలో కోలాజెన్ ఉత్పత్తిని తగ్గించి ముడతలు త్వరగా రావడానికి కారణమవుతాయి. అలాగే, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వలన చర్మానికి రక్త ప్రసరణ సరిగా జరగదు.
5. ప్రాసెస్డ్ ఫుడ్స్
చిప్స్, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ జ్యూస్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో కృత్రిమ రసాయనాలు, కలర్‌లు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషకాలు ఇవ్వకపోవడంతో పాటు చర్మంలో కాంతిని కూడా తగ్గిస్తాయి.
గమనిక...
చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం అంటే...తాజా పండ్లు, కూరగాయలు, కాయధాన్యాలు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రీషనిస్ట్ సలహా తీసుకుని మాత్రమే ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం మంచిది.