Face Glow: అరటి పండులో ఇవి కలిపి ముఖానికి రాస్తే... అందం రెట్టింపు అవ్వడం ఖాయం..!
Face Glow: అరటి పండు తినడం కాకుండా... ముఖానికి ఫేస్ ప్యాక్ గా రాయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే... కేవలం అరటి పండు కాకుండా... దానిలో కొన్నింటిని కలపడం వల్ల.... ఫేస్ లో గ్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది.

Face Glow
అరటి పండు లో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ అరటిపండు రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. దానితో పాటు... మన చర్మం, జుట్టు కూడా మెరుగుపడుతుంది. అరటి పండు తినడం కాకుండా... ముఖానికి ఫేస్ ప్యాక్ గా రాయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే... కేవలం అరటి పండు కాకుండా... దానిలో కొన్నింటిని కలపడం వల్ల.... ఫేస్ లో గ్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
అరటి పండులో పోషకాలు....
అరటి పండులో పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు ఇ, సి చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు ఫేస్ మాస్క్ వాడటం వల్ల మీ చర్మంలో మెరుపు పెరుగుతుంది. అరటి పండులోని సిలికా చర్మాన్ని హైడ్రేటెడ్ గా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఈ అరటి పండు చర్మం యవ్వనంగా మారడానికి కూడా సహాయపడుతుంది.
అరటి పండుతో ఫేస్ ప్యాక్....
జస్ట్ అరటి పండు గుజ్జును ముఖానికి రాయడం కంటే... దానిలో కొద్దిగా రోజ్ వాటర్, తేనె, పచ్చి పాలు లాంటివి వేసి.. బాగా కలిపి మంచి మిశ్రమంలా తయారు చేయాలి. దీనిని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దానికంటే ముందు మీ ముఖాన్ని నీటితో మంచిగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత... మీ ముఖాన్ని నీటితో కడిగితే సరిపోతుంది. దీని వల్ల మీ ముఖం మెరుస్తూ కనపడుతుంది.
జిడ్డుగల చర్మానికి ఫేస్ ప్యాక్...
కావలసినవి: అరటిపండు, బొప్పాయి, కీర దోసకాయ
ఈ అరటి ఫేస్ ప్యాక్ బొప్పాయి, కీర దోసకాయ ,అరటిపండు మిశ్రమం జిడ్డు గల చర్మానికి అద్భుతంగా పనిచేస్తుంది. అరటిపండు, బొప్పాయి రెండూ కలిపిన మిశ్రమం ముఖానికి రాయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇక కీరదోస చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల.. ముఖంలో తేజస్సు కనపడుతుంది. దీని కోసం.... 1/4 బొప్పాయి, 1/4 దోసకాయ , 1/2 అరటిపండు తురుముతో నునుపుగా పేస్ట్ చేయండి. పేస్ట్‌ను మీ ముఖం , మెడకు అప్లై చేసిన తర్వాత, 15 నిమిషాలు వేచి ఉండండి. ఆ తర్వాత, గోరువెచ్చని నీటితో బాగా కడగాలి.
యవ్వనంగా కనిపించడానికి....
యవ్వనంగా కనిపించడానికి మీరు పెరుగు, అరటి పండు మిశ్రమం వాడితే సరిపోతుంది. పెరుగులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు.. ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, ముఖంపై ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అరటిపండులో లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది చర్మం రంగు మెరుగుపడటానికి సహాయపడుతుంది. అరటి పండు, పెరుగు కలయిక కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం.. ఒక గిన్నెలో సగం పండిన అరటిపండును 2 టేబుల్ స్పూన్ల పెరుగుతో కలిపి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం , మెడపై సమానంగా పూయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
మొటిమలను తగ్గించే అరటి పండు.....
పదార్థాలు: అరటిపండు, పసుపు , వేప
వేప , పసుపు లో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. అరటిపండులోని విటమిన్ సి మంట, చికాకును తగ్గిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ మొటిమలను నయం చేయడంలో , మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం..ఒక గిన్నెలో సగం అరటిపండును 1 టేబుల్ స్పూన్ పసుపు లేదా 1 టేబుల్ స్పూన్ వేప పొడి లేదా పేస్ట్ తో మెత్తగా చేయాలి. మెత్తని పేస్టులాగా చేసి.. ముఖానికి రాసి.. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమలు పూర్తిగా తగ్గుతాయి.
పొడి చర్మం ఉన్నవారు....
పొడి చర్మం ఉన్నవారు.. అరటి పండు పేస్టులో కొబ్బరి నూనె, తేనె వేసి మంచి మిశ్రమంలా కలుపుకోవాలి. దీనిని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే... యవ్వనంగా కనిపిస్తారు. అరటి పండులో పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ ఇ ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచడానికి సహాయపడతాయి. తేనె కూడా చర్మానికి మంచి తేమను అందిస్తుంది.