Glowing Skin: బొప్పాయితో వీటిని కలిపిరాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!
ముఖం.. అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్ లు, క్రీములు వాడుతుంటారు. కానీ బొప్పాయి ఫేస్ ప్యాక్ ను ఎప్పుడైనా ట్రై చేశారా? దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
బొప్పాయి ఫేస్ ప్యాక్
బొప్పాయి శరీర ఆరోగ్యానికే కాదు.. చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంతోపాటు మెరిసేలా చేస్తాయి. బొప్పాయి ఫేస్ ప్యాక్ మృత కణాలను తొలగించడానికి, మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. చర్మానికి ఎంతగానో మేలు చేసే బొప్పాయి ఫేస్ ప్యాక్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
బొప్పాయి, పసుపు ఫేస్ ప్యాక్:
బొప్పాయి, పసుపు ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలు వేసి మెత్తగా చేసుకోండి. దాంట్లో కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి.. పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి మార్పులు కనిపిస్తాయి.
బొప్పాయి, చందనం ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో బొప్పాయి ముక్కలను వేసి మెత్తగా చేసుకోండి. దాంట్లో చందనం పొడి, నిమ్మరసం, తేనె కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. తర్వాత ఆ పేస్ట్‌ను ముఖానికి రాసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం చల్లటి నీటితో కడిగేయండి.
అరటిపండు, దోసకాయ, బొప్పాయి ఫేస్ ప్యాక్:
దోసకాయ, అరటిపండు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. దోసకాయను చిన్న ముక్కలుగా కోసి, బొప్పాయి, అరటిపండుతో కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేయండి. ఆ పేస్ట్‌ను ముఖంతో పాటు మెడకు కూడా రాయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.