Skin care: ఇదొక్కటి రాస్తే చాలు.. ముఖం మృదువుగా, అందంగా మారుతుంది!
వేసవిలో రకరకాల చర్మ సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకోసం చాలామంది మార్కెట్లో దొరికే కొన్ని ప్రాడక్టులు వాడుతుంటారు. వాటిలో కెమికల్స్ ఉండటం వల్ల చర్మ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సహజ పదార్థాలతో మృదువైన చర్మాన్ని ఎలా పొందాలో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మృదువైన చర్మం కోసం ఏం చేయాలి?
వేసవిలో చర్మం పొడిబారడం, డల్ గా మారడం లాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు ఎన్నిరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లు వాడినా ఫలితం కనిపించదు. పైగా కెమికల్స్ ఉన్న ప్రాడక్టులు వాడటం వల్ల చర్మం మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు మెరిసేలా చేసే సహజమైన ఫేస్ ప్యాక్ వాడటం మంచిది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఖరీదైన ఉత్పత్తులు కొనాల్సిన పనిలేదు. అలోవెరా, తేనెను కలిపి వాడితే చాలు. ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.
తేనె ప్రయోజనాలు
తేనె చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, యాంటీ బాక్టీరియల్ గుణాలున్నాయి. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మృత కణాలను తొలగిస్తుంది. ముఖం మీద ముడతలు, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
అలోవెరా జెల్ - 2 టీస్పూన్లు
గ్లిజరిన్ - 1 టీస్పూన్
తేనె - 1 టీస్పూన్.
కావాలంటే 2-3 చుక్కల ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు.
ఫేస్ ప్యాక్ తయారీ:
ఒక గిన్నెలో అలోవెరా జెల్, తేనె, గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించాలి. 10 నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. తర్వాత ముఖం కడుక్కోవాలి. మొదటిసారి వాడినప్పుడే మనం మంచి ఫలితాలను చూడచ్చు. చర్మం ఎంత మృదువుగా, తాజాగా మారుతుందో తెలిసిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ ని రోజూ లేదా వారానికి 2-3 సార్లు వాడొచ్చు.