MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Menopause: 50 తర్వాత మహిళలు ఇవి తప్పక తినాలి, లేదంటే ఏం జరుగుతుందంటే..?

Menopause: 50 తర్వాత మహిళలు ఇవి తప్పక తినాలి, లేదంటే ఏం జరుగుతుందంటే..?

Menopause: 50 తర్వాత మహిళలు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా కష్టం. హార్మోనల్ చేంజేస్, ఎముకల వీక్‍నెస్, అలసిపోవడం కామన్. అందుకే 50+ ఆడవాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన ఈ ఫుడ్స్ గురించి ఇప్పుడే చూద్దాం. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 17 2026, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
50 తర్వాత మెనోపాజ్
Image Credit : our own

50 తర్వాత మెనోపాజ్

50 ఏళ్లు దాటిన తర్వాత మహిళల శరీరంలో సహజంగానే ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మోనోపాజ్ కారణంగా హార్మోన్లలో అసమతుల్యత, ఎముకల బలహీనత, గుండె సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చు. రోజువారీ డైట్‍లో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ ను చేర్చుకుంటే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
అవిసె గింజలు
Image Credit : Getty

అవిసె గింజలు

ఇవి మహిళలకు ప్రత్యేకంగా ఉపయోగపడే సూపర్ ఫుడ్‍గా గుర్తింపు పొందాయి. అవిసె గింజల్లో ఉన్న పోషకాలు హార్మోన్లను బ్యాలె్స్ చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మోనోపాజ్ సమయంలో వచ్చే హాట్ ఫ్లాషెస్, హార్మోనల్ అసమతుల్యత తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రోజుకు ఒక చెంచా అవిసె గింజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. 

Related Articles

Related image1
Pregnant Women: గర్భిణీలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.5000 గిఫ్టుగా అందుకోండిలా
Related image2
Women Weight Loss Food: ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ముందుగా ఇది తినాలి!
36
దానిమ్మ
Image Credit : Getty

దానిమ్మ

దానిమ్మ కూడా ఈ వయసులో తప్పనిసరిగా తీసుకోవల్సిన ఫ్రూట్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే శరీరానికి యవ్వనాన్ని నిలబెట్టే లక్షణాలు దానిమ్మలో ఉంటాయి. కాబట్టి రోజూ ఒక దానిమ్మ లేదా దానిమ్మ రసం తీసుకోవడం మంచిది.

46
వాల్‍నట్స్
Image Credit : Asianet News

వాల్‍నట్స్

వాల్‍నట్స్ ఈ వయసులో మెదడు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో ఉన్న ఒమెగా-3 ప్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ ఫంక్షన్‍ను మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండటానికి, మెదడు చురుకుగా ఉండటానికి వాల్‍నట్స్ సహాయపడతాయి. అలాగే ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. 

56
బాదం
Image Credit : Getty

బాదం

బాదం కూడా మహిళల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బాదంలో కాల్షియం, విటమిన్ E వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ 4నుంచి5 బాదం నానబెట్టి తింటే మరింత ప్రయోజనం ఉంటుంది.

66
పాలకూర
Image Credit : Getty

పాలకూర

పాలకూర వంటి ఆకుకూరలు 50 తర్వాత మహిళలకు ఎంతో అవసరం. ఇందులో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలం ఇవ్వడంలో సహాయపడుతుంది. రక్తహీనత తగ్గించేందుకు స్పినాచ్ ఉపయోగపడుతుంది. వారానికి కనీసం 2 నుంచి 3 సార్లు పాలకూర ఆహారంలో చేర్చుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
మహిళలు
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Plus Size Kurti: బొద్దుగా ఉండే అమ్మాయిలకు సూటయ్యే బెస్ట్ కుర్తీలు
Recommended image2
Anklet Designs: ఎలాంటి పాదాలకు అయినా రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు
Recommended image3
Reshmi Bangles:రేష్మీ గాజుల మెరుపు... ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Related Stories
Recommended image1
Pregnant Women: గర్భిణీలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.5000 గిఫ్టుగా అందుకోండిలా
Recommended image2
Women Weight Loss Food: ఆడవాళ్లు బరువు తగ్గాలంటే ముందుగా ఇది తినాలి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved