Hair Care: ఈ ఒక్క సీరమ్ వాడినా చలికాలంలో హెయిర్ ఫాల్ ఉండదు..!
Hair Care: ఎన్నో సంవత్సరాలుగా మెంతులను జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ మెంతులను ఉపయోగించి మనం హెయిర్ మాస్క్ తో పాటు... హెయిర్ సీరమ్ తయారు చేసుకొని వాడితే జుట్టు అందంగా మారుతుంది.

Hair Care
చలికాలంలో చాలా మంది ఎదుర్కునే కామన్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. ఎంత ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతోందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటివారు కేవలం సహజంగా ఇంట్లో లభించే ఒక హెయిర్ ప్యాక్, ఒక హెయిర్ సీరమ్ వాడితే చాలు. జుట్టు రాలడం తగ్గడంతో పాటు... ఒత్తుగా, అందంగా మారుతుంది.
ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. దీనిని నివారించానికి మీరు మెంతులు వాడితే సరిపోతుంది. వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం....
మెంతులతో హెయిర్ ప్యాక్....
జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ, అందులో చండ్రు కూడా ఒకటి. చుండ్రును తగ్గించినప్పుడే జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. దానికోసం మెంతులను వాడాలి. మెంతులతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే... తక్కువ సమయంలోనే ఈ చండ్రు తగ్గుతుంది.
దీని కోసం, మూడు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను తీసుకొని రాత్రిపూట నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, ఈ మెంతిని మిక్సర్‌లో మెత్తగా పేస్ట్ చేయండి. దీనికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. ఈ హెయిర్ ప్యాక్‌ను తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత, సల్ఫేట్ లేని షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోండి. మంచి ఫలితాల కోసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు దీన్ని అనుసరించండి. నెలరోజుల్లో చండ్రు కచ్చితంగా తగ్గుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది..
మెంతులతో హెయిర్ సీరమ్...
మీరు ఇంట్లో తయారుచేసిన మెంతుల హెయిర్ సీరం కూడా తయారు చేసి ఉపయోగించవచ్చు. మెంతులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నానబెట్టిన తర్వాత, నీటిని వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోయాలి. మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని మీ తలపై రుద్దవచ్చు. మెంతుల్లో ప్రోటీన్ , పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది తలకు మంచి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇది జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా సహాయం చేస్తుంది.
ఈ రెండు సాధారణ పద్ధతులు మీ జుట్టును బలోపేతం చేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.

