Hair Care: చలికాలంలో ఇవి రోజూ తింటే జుట్టు రాలే సమస్యే లేదు..!
Hair Care: ఈ చలికాలంలో మీ డైట్ లో కొన్ని రకాల ఆహారాలను భాగం చేసుకోవడం ద్వారా మీరు జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జుట్టును పొందొచ్చు. అందుకోసం ఏం తినాలో తెలిస్తే చాలు.

Hair Care
రోజు రోజుకీ చలి పెరిగిపోతోంది. ఈ చలికి స్కిన్ సమస్యలు మాత్రమే కాదు... హెయిర్ సమస్యలు కూడా పెరిగిపోతాయి. ఎంత జాగ్రత్తగా చూసుకుందాం అని అనుకున్నా కూడా ఈ సీజన్ లో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు కాలుష్యం, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. దీంతో.. చాలా మంది కంగారు పడిపోతూ ఉంటారు. ఖరీదైన నూనెలు, షాంపూలు జుట్టుకు పూసేస్తూ ఉంటారు. అయితే... ఈ జుట్టు రాలడాన్ని తగ్గించడానికి నూనెలు, షాంపూలు కాకుండా... ఆహారంతో చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
కోడిగుడ్డు....
కోడిగుడ్డులో బయోటిన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు ప్రోటీన్ తో తయారౌతుంది. అందువల్ల ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లు జుట్లను కుదుళ్ల నుంచి బలోపేతం చేయానికి సహాయపడతాయి. అదేవిధంగా, బయోటిన్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే, ప్రతిరోజూ కోడిగుడ్డును మీ డైట్ లో భాగం చేసుకోవాలి.
పాలకూర...
పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ లోపం జుట్టు రాలడానికి ప్రధాన కారణం. పాలకూరలోని ఐరన్ తలలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. జుట్టు మూలాలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ హెల్ప్ చేస్తుంది. ఇక.. పాలకూరలో ఉండే విటమిన్ ఎ తలలో సహజ నూనెలు ఉత్పత్తి అవ్వడంలో హెల్ప్ చేస్తుంది.
నట్స్...
బాదం , వాల్‌నట్స్ వంటి గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్ , విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు నెత్తికి పోషణనిస్తాయి. పొడిబారడం వల్ల కలిగే జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జింక్ జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఇంకా, విటమిన్ E జుట్టును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది.
పెరుగు:
పెరుగులో ప్రోటీన్, విటమిన్ B5 పుష్కలంగా ఉంటాయి. దీనిలోని ప్రోటీన్ జుట్టుకు బలాన్ని ఇస్తుంది. విటమిన్ B5 నెత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు సాంద్రతను కూడా బలపరుస్తుంది.
ఉల్లిపాయ:
ఉల్లిపాయ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే శక్తి కేంద్రంలా పనిచేస్తుంది. ఉల్లికాయలో అధిక విటమిన్ సి కంటెంట్ కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి కొల్లాజెన్ అవసరం. అంతేకాకుండా, ఇది జుట్టు తెల్లబడడాన్ని కూడా ఆలస్యం చేస్తుంది.

