Skin Care: ఎండకు ముఖం నల్లపడిందా? జస్ట్ ఇవి రాస్తే చాలు
ఈ ఎండాకాలం ఎండలో పది నిమిషాలున్నా ఫేస్ మీద ట్యాన్ పేరుకుపోతుంది. ముఖం అంతా అన్ ఈవెన్ గా కనపడుతుంది. ఈ ట్యాన్ ని పోగొట్టుకునేందుకు ఖరీదైన క్రీములు వాడుతూ ఉంటారు చాలా మంది. అయితే, ఆ క్రీములు అవసరం లేకుండా.. మన ఇంట్లో ముఖ్యంగా కిచెన్ లో లభించే కొన్ని ఉత్పత్తులు వాడినా, ఆ ట్యాన్ మొత్తం ఈజీగా పోగొట్టచ్చు.

సమ్మర్ లో ఎండ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బయటకి వెళ్తే చాలు.. స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా చర్మంపై ట్యాన్ పేరుకుపోతుంది. ఈ ట్యాన్ ని వదిలించడం అంత ఈజీ కాదు. నిజానికి ప్రతిరోజూ కాసేపు ఎండలో ఉండటం మంచిదే. దాని వల్ల మనకు డి విటమిన్ వస్తుంది. కానీ, ఈ ఎండాకాలం ఎండలో పది నిమిషాలున్నా ఫేస్ మీద ట్యాన్ పేరుకుపోతుంది. ముఖం అంతా అన్ ఈవెన్ గా కనపడుతుంది. ఈ ట్యాన్ ని పోగొట్టుకునేందుకు ఖరీదైన క్రీములు వాడుతూ ఉంటారు చాలా మంది. అయితే, ఆ క్రీములు అవసరం లేకుండా.. మన ఇంట్లో ముఖ్యంగా కిచెన్ లో లభించే కొన్ని ఉత్పత్తులు వాడినా, ఆ ట్యాన్ మొత్తం ఈజీగా పోగొట్టచ్చు. మరి, దాని కోసం మీ ముఖానికి ఏం రాయాలో ఓసారి చూద్దామా...
tomato face pack
1.టమాట తో ఫేస్ మాస్క్..
టమాటతో మన స్కిన్ కి ఎలా గ్లో వస్తుంది, ట్యాన్ ఎలా పోతుంది అని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే.. టమాటలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిని ముఖానికి రాయడం వల్ల చర్మాన్ని రీఫ్రెష్ చేయడంతో పాటు.. ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ మొత్తాన్ని ఈజీగా తొలగిస్తుంది. అంతేకాదు.. మీ స్కిన్ చాలా మృదువుగా కూడా మారుస్తుంది. మరి, ఈ టమాటను ముఖానికి ఎలా రాయాలో తెలుసా? ఒక టమాట గుజ్జును తీసుకొని ముఖంపై లేదా ట్యాన్ ఉన్న ప్రదేశంలో రుద్దితే చాలు. 15-20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. ఇలా రెగ్యులర్ గా చేస్తే మీ ముఖం ట్యాన్ పోవడమే కాదు, ఫేస్ లో గ్లో కూడా వస్తుంది.
honey facepack
2. నిమ్మరసం + తేనె మిశ్రమం
నిమ్మరసం చర్మం నుంచి మృతకణాలను తొలగించే బలమైన నేచురల్ బ్లీచర్. తేనె చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతుంది. ఈ రెండింటితో ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ మొత్తం పోతుంది.
వాడే విధానం: నిమ్మరసం , తేనెను సమాన భాగాల్లో కలిపి ముఖానికి రాసుకోవాలి. 10–15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.
3. అలోవెరా + బాదం నూనె ప్యాక్
కలబంద చర్మాన్ని చల్లబరిచే గుణం కలిగి ఉంటుంది, బాదం నూనె పోషణను అందిస్తుంది. ఈ రెండూ ముఖానికి రాయడం వల్ల కూడా ట్యాన్ పోతుంది. అంతేకాదు, మీ ముఖాన్ని చాలా మృదువుగా మారుస్తుంది.
వాడే విధానం: తాజా అలోవెరా గుజ్జులో కొద్దిగా బాదం నూనె కలిపి ఫేస్ ప్యాక్‌లా వాడండి. ఇది ట్యాన్‌ను తగ్గించి ముఖానికి అందం ఇస్తుంది.
4. శెనగపిండి + పసుపు ప్యాక్
ఇది పురాతన కాలం నుంచే ప్రసిద్ధి చెందిన ట్యాన్ రిమూవర్. శెనగపిండి డీప్ క్లెన్సింగ్ చేస్తే, పసుపు యాంటీ సెప్టిక్‌లా పనిచేస్తుంది. ప్రతిరోజూ శెనగపిండితో నలుగుపెట్టుకొని స్నానం చేసినా.. వారం రోజుల్లో మీ ముఖంలో తేడా స్పష్టంగా చూడొచ్చు.
వాడే విధానం: శెనగపిండి, పసుపు, పాలు, రోజ్ వాటర్ కలిపి ముద్దలా తయారుచేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి.
5. ఓట్‌మీల్ + మజ్జిగ స్క్రబ్
ఓట్‌మీల్ మృదువుగా స్క్రబ్ చేయడం ద్వారా మృత చర్మ కణాలను తొలగిస్తుంది. మజ్జిగ చర్మాన్ని శీతలీకరించి సాఫ్ట్‌గా ఉంచుతుంది.
వాడే విధానం: ఓట్‌మీల్‌ను మజ్జిగలో 10 నిమిషాలు నానబెట్టి పేస్ట్ తయారుచేయండి. ముఖానికి రాసి, 15 నిమిషాల తర్వాత గట్టిగా స్క్రబ్ చేసి కడిగేయండి.
ఈ ఫేస్ ప్యాక్‌లను వారంలో 2–3 సార్లు ఉపయోగించితే, వేసవి ఎఫెక్ట్‌ను తగ్గించడమే కాకుండా చర్మానికి నిగారింపు, కాంతి కూడా లభిస్తుంది.