- Home
- Life
- Woman
- Face Glow: శనగ పిండి కాదు, ఈ పిండిలో పెరుగు కలిపి ముఖానికి రాస్తే, నిమిషాల్లో ఫేస్ గ్లో..!
Face Glow: శనగ పిండి కాదు, ఈ పిండిలో పెరుగు కలిపి ముఖానికి రాస్తే, నిమిషాల్లో ఫేస్ గ్లో..!
Face Glow: మన సహజ సౌందర్య కోసం మెంతులు చాలా బాగా సహాయపడతాయి. ఇప్పటి వరకు మెంతులను జుట్టు పెరగడానికి వాడే ఉంటారు. కానీ, ఇవే మెంతులు.. మీ ముఖంలో గ్లో తీసుకురావడానికి కూడా హెల్ప్ చేస్తాయి.

Face Glow
వయసు పెరుగుతున్నా కూడా ముఖంపై ఎలాంటి ముడతలు లేకుండా, వయసులో చిన్న వారిలా కనిపించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసమే ఖరీదైన క్రీములు కొనేసి ముఖానికి పూసేస్తూ ఉంటారు. కానీ, కెమికల్స్ తో నిండిన క్రీములు ముఖానికి రాస్తే.. భవిష్యత్తులో వాటి వల్ల డ్యామేజ్ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. అలా కాకుండా, సహజంగా కూడా ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు.
మెంతులతో ఫేస్ ప్యాక్...
చాలా మంది కామన్ గా ముఖంపై మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ మొటిమలు ముఖ సౌందర్యాన్ని దెబ్బ తీస్తాయి. ఈ మొటిమలను ఈ మెంతుల ప్యాక్ తో చెక్ పెట్టొచ్చు. మెంతులను పొడిలా చేసి, పెరుగులో కలిపి ముఖానికి రాస్తే... మొటిమలు నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్, రోజ్ వాటర్ కూడా చేర్చితే... మొటిమలు తగ్గడమే కాకుండా, ఫేస్ లో గ్లో కూడా పెరుగుతుంది. ముఖంలో మెరుపు మాత్రం వెంటనే కనిపిస్తుంది.
మెంతుల ఫేస్ ప్యాక్ తయారీ..
ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ముందుగా మెంతుల గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు, నీటిని తీసివేసి మిక్సర్‌లో పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌లో 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి. ఇప్పుడు విటమిన్ E క్యాప్సూల్ నుండి నూనెను తీసివేసి, బాగా కలపండి. మీరు కోరుకుంటే, మీరు ఈ పేస్ట్‌లో రోజ్ వాటర్ కూడా జోడించవచ్చు. రోజ్ వాటర్ సువాసనకు ప్రయోజనకరంగా పరిగణిస్తారు. చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ని ముఖానికి అప్లై చేయడానికి ముందు... నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగానికి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు చొప్పున ఒక రెండు నెలలు రాసి చూడండి.. మీ ముఖం అందంగా మెరుస్తూ కనపడుతుంది. మునుపటి కంటే యవ్వనంగా కనిపిస్తారు.
చర్మానికి మెంతుల ప్రయోజనాలు...
మెంతులు, పెరుగూ రెండూ చర్మానికి ప్రయోజనం కలిగించేవే. చాలా తక్కువ సమయంలో మొటిమలను తగ్గించేస్తాయి. ఫేస్ క్లియర్ గా మారుతుంది. ఈ మెంతుల్లో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు.. మొటిమలకు కారణమయ్యే బాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ మెంతులను ముఖానికి రాయడం వల్ల, ముఖాన్ని శుభ్ర పరుస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మారుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి... ముఖంపై నల్ల మచ్చలను, పిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. రెగ్యులర్ గా రాయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. ఫైన్ లైన్స్ కూడా తగ్గిపోతాయి.