- Home
- Life
- Woman
- Beauty Tips: రోడ్డు పక్కన దొరికే ఈ పూలు వాడితే.. ముఖంలో మెరుపు, జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా
Beauty Tips: రోడ్డు పక్కన దొరికే ఈ పూలు వాడితే.. ముఖంలో మెరుపు, జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా
Beauty Tips: తెలంగాణ లో విరివిగా దొరికే పువ్వు తంగేడు. తెలంగాణ రాష్ట్ర పుష్పం కూడా ఇదే. ఈ పువ్వులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు రంగులో ఉండే ఈ పువ్వుని కొన్ని పదార్థాలు ఉపయోగించి ముఖానికి రాయడం వల్ల యవ్వనంగా మారతారు.

Beauty Tips
రోజు రోజుకీ అందాన్ని పెంచుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. దాని కోసం ఖరీదైన ట్రీట్మెంట్లు, వేల రూపాయలు ఖరీదైన క్రీములు కొనేసి రోజూ ముఖానికి పూసేస్తూ ఉంటారు. కానీ.. రూపాయి ఖర్చు లేకుండా కూడా అందాన్ని పెంచుకోవచ్చు అని చాలా మందికి తెలీదు. అది కూడా రోడ్డు పక్కన దొరికే.. కొన్ని పూలను వాడి ముఖ సౌందర్యంతో పాటు.. కేశ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. అది మరేంటో కాదు.. తంగేడు పువ్వు.
చర్మ ఆరోగ్యానికి తంగేడు పువ్వు....
చాలా మంది స్కిన్ ఎలర్జీలు వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటివారు ఎండిపోయిన తంగేడు పువ్వులను అల్ఫాల్ఫా గింజలతో కలిసి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే సరిపోతుంది. చర్మ వ్యాధులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా... ఈ తంగేడు పూలు ముఖంపై నల్ల మచ్చలను తగ్గించడంలోనూ అద్భుతంగా పని చేస్తాయి. తంగేడు పూలను ఎండపెట్టి.. పొడిలా చేసుకొని, అందులో కొద్దిగా శెనగపిండి, రోజ్ వాటర్ కూడా చేర్చి బాగా కలిపి.. ముఖానికి పూస్తే.. చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
ఆయిల్ స్కిన్ ఉన్నవారికి..
జిడ్డు చర్మం ఉన్నవారు స్పూన్ బియ్యం పిండి తీసుకొని, అందులో తంగేడు పూల పొడిని కలిపాలి. దానిలో కొద్ది నీరు పోసి... ముఖానికి స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన జిడ్డు తగ్గిపోతుంది. ముఖం ప్రకాశవంతంగా కనపడుతుంది.
తంగేడుపూలతో ఫేస్ ప్యాక్..
తంగేడు పూలను నీటిలో వేసి... స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. బాగా మరిగి, నీరు రంగు మారిన తర్వాత... ఆ పూలను మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ముల్తానీ మట్టి కూడా వేసి మరిగించిన నీరు కొద్ది కొద్దిగా వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మీ ముఖం మెరుస్తూ కనపడుతుంది.
జుట్టు ఆరోగ్యానికి తంగేడు పువ్వు....
తంగేడు పువ్వు ప్రయోజనాలు చర్మానికి మాత్రమే కాదు, జుట్టు , తల చర్మం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. తంగేడు పూల పొడిని, మెంతుల పొడి, కలబంద గుజ్జు వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టిస్తే... చుండ్రు సమస్య తగ్గుతుంది. అంతేకాదు.. రెగ్యులర్ గా ప్రయత్నిస్తే... తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనెలో తంగేడు పూలు, మెంతులు, గోరింటాకు, కరివేపాకు వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను రెగ్యులర్ గా వాడితే జుట్టు రాలే సమస్య కూడా ఉండదు. ఒత్తుగా కూడా పెరుగుతుంది.