Face Glow: రాత్రి పడుకునే ముందు ఇది రాస్తే.. ఉదయానికి ముఖం మెరిసిపోవడం ఖాయం..!
Face Glow: మన అందాన్ని పెంచే సీరమ్స్ మార్కెట్లో చాలానే దొరుకుతాయి. కానీ, అవి చాలా ఖరీదైనవి. వాటిని కొనే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు. కానీ... మనం ఇంట్లోనే సహజంగా ఓ సీరమ్ ని తయారు చేసుకోవచ్చు.

Face Glow
మెరిసే చర్మాన్ని పొందాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ, దాని కోసం ఖరీదైన క్రీములు వాడాల్సిన అవసరం లేదు. నార్మల్ స్కిన్ కేర్ ఫాలో అయితే చాలు. చాలా మంది స్కిన్ కేర్ అంటే.. కేవలం ఉదయం పూట మాత్రమే ఫాలో అవుతారు. కానీ.. రాత్రి పూట కూడా చర్మ సంరక్షణ కూడా పాటించాలి. ఇలా చేయడం వల్ల... మీ చర్మం అందంగా కనిపించడంతో పాటు... మీ చర్మ సమస్యలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది.
మన అందాన్ని పెంచే సీరమ్స్ మార్కెట్లో చాలానే దొరుకుతాయి. కానీ, అవి చాలా ఖరీదైనవి. వాటిని కొనే స్థోమత అందరికీ ఉండకపోవచ్చు. కానీ... మనం ఇంట్లోనే సహజంగా ఓ సీరమ్ ని తయారు చేసుకోవచ్చు. ఆ సీరమ్ ని రాత్రి పడుకునే ముందు రాసుకుంటే... ఉదయానికి మెరుస్తూ కనిపిస్తారు. మరి, ఆ సీరమ్ ఎలా తయారు చేయాలి? ముఖానికి ఎలా వాడాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం....
ఇంట్లో సీరమ్ తయారు చేయడానికి కావాల్సినవి...
బంగాళ దుంప, రోజ్ వాటర్, విటమిన్ ఇ క్యాప్సిల్స్
సీరమ్ తయారు చేసే విధానం...
మీరు ఇంట్లోనే ప్రత్యేకంగా సీరమ్ తయారు చేసుకోవచ్చు. ఈ సీరమ్ ని వాడటం మొదలుపెడితే.. మళ్లీ మార్కెట్లో దొరికే సీరమ్ కొనాల్సిన, వాడాల్సిన అవసరమే రాదు. దీని వల్ల మన డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ సీరమ్ తయారు చేయడానికి, ఒక గిన్నెలో బంగాళ దుంప రసం తీసుకోవాలి. ఈ బంగాళ దుంప రసంలో.. విటమిన్ ఈ క్యాప్సిల్, రోజ్ వాటర్ కూడా వేసి బాగా కలపాలి. దీనిని ఒక స్ప్రే బాటిల్ లో నింపి.. ముఖానికి రాస్తే సరిపోతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు....
ఇప్పుడు, ప్రతి రాత్రి పడుకునే ముందు, మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోండి. ఆరిన తర్వాత, ఈ సీరంను స్ప్రే బాటిల్ ఉపయోగించి మీ ముఖంపై స్ప్రే చేసి, మీ ముఖం అంతటా సున్నితంగా అప్లై చేయండి. మీరు మరుసటి రోజు మీ ముఖాన్ని కడగవచ్చు. ప్రతిరోజూ సీరం వాడటం వల్ల మచ్చలు తగ్గుతాయి. మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. మెరుస్తూ కూడా కనపడుతుంది.