Samantha Ring: భర్త రాజ్ బహుమతి...సమంత ఉంగరం ధరెంతో తెలుసా?
Samantha Ring: ఆ ఉంగరాన్ని ఎంగేజ్మెంట్ రోజున రాజ్ తొడిగినట్లు తెలుస్తోంది. ఇక... వీరి ఎంగేజ్మెంట్ కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగినట్లు సమాచారం. ఎందుకంటే... అప్పటి నుంచి ఆ ఉంగరం సమంత చేతికి ఉంది.

Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమంత చాలా కాలంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఇద్దరూ ఏ రోజు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా.. డైరెక్ట్ గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరినీ షాకింగ్ కి గురి చేసింది.
ఉంగరం ధర ఎంత..?
ఆ పెళ్లి ఫోటోల్లో సమంత పెట్టుకున్న ఉంగరం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ ఉంగరాన్ని ఎంగేజ్మెంట్ రోజున రాజ్ తొడిగినట్లు తెలుస్తోంది. ఇక... వీరి ఎంగేజ్మెంట్ కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరిగినట్లు సమాచారం. ఎందుకంటే... అప్పటి నుంచి ఆ ఉంగరం సమంత చేతికి ఉంది.
అది డైమండ్ రింగ్ కాగా... చూడటానికి మాత్రం చాలా భిన్నంగా ఉంది. దీంతో... దాని ఖరీదు ఎంతో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. పలు మీడియా కథనాలలో తెలిపిన సమాచారం ప్రకారం సమంత వివాహ ఉంగరం విలువ దాదాపు రూ.50 లక్షలు అని తెలుస్తోంది.
నాగచైతన్యతో పెళ్లి సమయంలో తొడిగిన ఉంగరం ఏమైంది?
సమంత 2017లో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, కొన్ని రకాల కారణాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు. అయితే.... చైతూతో పెళ్లి సమయంలో ఉంగరాన్ని సమంత తన దగ్గరే ఉంచుకుంది. అయితే... ఆ ఉంగరంలోని 3-క్యారెట్ ప్రిన్సెస్ కట్ డైమండ్‌ను లాకెటుగా మార్చి ఆమె ధరించారు. అంతేకాదు అప్పటి తన పెళ్లి గౌనును నలుపు రంగు గౌనుగా కూడా మార్చేసింది.
అభిమానుల విషెస్..
సమంత – రాజ్ వివాహ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. పెళ్లి ఫోటోలు, ప్రత్యేక ఉంగరం, స్టార్ కపుల్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు, తమ వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకునే ఈ జంట ఇప్పుడు పబ్లిక్‌గా తమ కొత్త జీవితాన్ని స్వాగతించడంతో, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

