- Home
- Entertainment
- సమంత ఈషా ఫౌండేషన్‌లోనే ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? `భూత శుద్ధి వివాహం` స్పెషాలిటి ఇదే
సమంత ఈషా ఫౌండేషన్‌లోనే ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? `భూత శుద్ధి వివాహం` స్పెషాలిటి ఇదే
సమంత, రాజ్ నిడిమోరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరిద్దరు భూత శుద్ధి వివాహం నేపథ్యంలో పెళ్లి చేసుకోవడం విశేషం. మరి అదేంటో తెలుసుకుందాం.

దర్శకుడు రాజ్ నిడిమోరుతోనే సమంత పెళ్లి
సమంత ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకుంది. ముందు నుంచి ఊహించినట్టుగానే ఆమె దర్శకుడు రాజ్ నిడిమోరుని వివాహం చేసుకుంది. నేడు సోమవారం(డిసెంబర్ 1)న సమంత, రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూర్‌లోని ఇషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో జరగడం విశేషం. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ మేరకు ఫోటోలను షేర్ చేస్తూ ఈ రోజు డేట్‌తో వైట్ లవ్ ఎమోజీలను పోస్ట్ చేసింది.
వీరి ప్రేమకి పునాది వేసిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2`
దీంతో ఇన్నాళ్లు వస్తోన్న రూమర్లకి శుభం కార్డ్ వేసింది సమంత. ఈ ఇద్దరు `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్‌కి కలిసి పనిచేశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అది ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లింది. సమంత ఇప్పటికే హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ ఇద్దరు విడిపోయారు. దాదాపు ఐదేళ్లుగా ఒంటరిగానే ఉన్న సమంత ఇప్పుడు ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే నాగచైతన్య సైతం ఇప్పటికే హీరోయిన్ శోభితా దూళిపాళ్లని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇషా ఫౌండేషన్‌లోనే పెళ్లి ఎందుకంటే?
ఇక సమంత, రాజ్ నిడిమోరు ఈషా ఫౌండేషన్‌లో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. ఇక్కడే ఎందుకు పెళ్లి చేసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ ఇద్దరు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు. ఇదే సమంత పెళ్లి ప్రత్యేకత. ఇలాంటి ఆచారంలో పెళ్లి కేవలం ఇక్కడ మాత్రమే చేస్తారు. ఇది అత్యంత పురాతనమైన పెళ్లి సాంప్రదాయం.
భూత శుద్ధి వివాహ సాంప్రదాయంలో సమంత పెళ్లి
యోగకి ఇషా ఫౌండేషన్ కేరాఫ్‌గా నిలుస్తోంది. ఎంతో మంది భక్తులు దీన్ని పవిత్రమైన యోగా కేంద్రంగా భావిస్తారు. తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఇషా ఫౌండేషన్ (Isha Foundation Coimbatore)ను సద్గురు స్థాపించారు. సేవా దృక్పథంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తోన్న ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇదొకటి. ఎక్కువ శాతం మంది యోగ నేర్చుకునేందుకు, మానసిక ప్రశాంతతకు అక్కడికి వెళతారు. సమంత కూడా చాలాఏళ్లుగా తరచూ ఇక్కడికి వెళ్తుంది. ఇషా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో లింగ భైరవి ఆలయం ఉంది. భైరవి మాతను సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయం 'భూత శుద్ధి వివాహాల'కు ప్రసిద్ధి.
భూత శుద్ధి వివాహం అంటే
ఇప్పుడు సమంత, రాజ్ నిడిమోరు కూడా ఇందులోనే వివాహం చేసుకున్నారు. అయితే ఈ భూత శుద్ధి వివాహం ఏంటనేది చూస్తే, సృష్టిలో పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే ఈ భూత శుద్ధి వివాహం. అన్ని వివాహాల్లో దీన్ని అత్యంత పవిత్రమైన వివాహంగా భావిస్తుంటారు. ఈ వివాహ ప్రక్రియలో వధూవరుల దేహాల్లోని పంచ భూతాలను శుద్ధి చేస్తారు. పెళ్లి చేసుకునే జంట మధ్య మానసికంగా, భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన, భౌతిక బంధాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఉచ్ఛ్వాస, నిశ్వాసలకు అతీతంగా ప్రాణ, మరణ భయాలకు, ఆందోళనలకు దూరంగా అన్ని రకాల భావోద్వేగాలకు దూరంగా లింగ భైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ వేడుకే ఈ భూత శుద్ధి వివాహంగా చెబుతుంటారు. ఇప్పుడు సమంత, రాజ్ ఈ ప్రత్యేకమైన ట్రెడిషన్‌లో వివాహం చేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడిది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

