Hair Care: ఈ చిట్కాలు ఫాలో అయితే 2026లో హెయిర్ ఫాల్ అనేదే ఉండదు..!
Hair Care: మరి కొద్ది రోజుల్లో మనమంతా 2026లో అడుగుపెడుతున్నాం. ఈ కొత్త సంవత్సరంలో అయినా మీ జుట్టును అందంగా మార్చుకోవాలి అని మీరు అనుకుంటున్నట్లయితే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.

Hair Care
అందమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే... అలాంటి జుట్టు పొందాలంటే ఖరీదైన నూనెలు, షాంపూలు మాత్రమే వాడాలి అని చాలా మంది అనుకుంటారు. దానిని కొంత కాలం ఫాలో అవుతారు. ఆ తర్వాత వదిలేస్తారు. చివరకు జుట్టు రాలడం తగ్గలేదని ఫీలౌతూ ఉంటారు. హెయిర కేర్ లో నిర్లక్ష్యం చేయడం మొదలుపెడితే.. జుట్టు విపరీతంగా రాలిపోతుంది. పొడి బారుతుంది. పెరగడం ఆగిపోతుంది. ఇలా జరగకూడదంటే... ఈ కొత్త సంవత్సరంలో కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. ఇవి ఫాలో అయితే... హెయిర్ ఫాల్ ఉండదు. మీ జుట్టు అందంగా కూడా కనపడుతుంది.
జుట్టు ఆరోగ్యం...
చాలా మంది జుట్టు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఖరీదైన సీరమ్స్, పలు రకాల హెయిర్ మాస్క్ లు వాడుతూ ఉంటారు. అయితే.. జుట్టుతో పాటు తల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చుండ్రు, దురద, ఎక్కువ జిడ్డుగా ఉండటం లాంటి సమస్యలు వస్తున్నాయంటే.. హెయిర్ కేర్ తీసుకోవాలని అర్థం. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హెయిర్ ఆయిల్ రాసినప్పుడు మరుసటి రోజే తలస్నానం చేయాలి. ఎక్కువ రోజులు జుట్టు కు నూనె రాసి ఉంచడం వల్ల జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది.
జుట్టుకు నూనె ఎలా రాయాలి?
జుట్టుకు నూనె రాయడం తప్పు కాదు, కానీ తప్పుగా రాయడమే సమస్య. ఎక్కువ నూనె రాసి రాత్రంతా అలాగే ఉంచడం వల్ల ఫోలికల్స్ మూసుకుపోయి జుట్టు రాలే అవకాశం ఉంటుంది. జుట్టు సమస్యను బట్టి నూనెను ఎంచుకోవాలి. పొడిబారిన జుట్టుకు కొబ్బరి లేదా బాదం నూనె, ఎక్కువగా జుట్టు రాలుతోంది అన్నప్పుడు.. జుట్టుకు తేలికైన నూనెలతో ఆముదం, చలికాలంలో ఆవ నూనె వాడాలి. 5 నుంచి 10 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి కొన్ని గంటల తర్వాత హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది.
ఖరీదైన ఉత్పత్తులు కాదు... ఆహారం ముఖ్యం...
ఖరీదైన షాంపూలు వాడుతున్నా సరే, ఆహారం సరిగా తీసుకోకపోతే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. కాబట్టి, పోషకాలు ఉన్న ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. పప్పులు, గుడ్లు, పెరుగు, పన్నీర్, గింజలు వంటి ఆహారాలను మానేయకూడదు. ఐరన్, విటమిన్ డి లోపాలు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. సీజనల్ గా లభించే పండ్లు, ఆకుకూరలు, సరిపడా నీరు తీసుకుంటే.. జుట్టు రాలదు.
మీ జుట్టు ఆకృతిని అంగీకరించాలి
చాలామంది తమ జుట్టు సహజ ఆకృతిని అంగీకరించరు. ఉంగరాల జుట్టును స్మూత్ గా చేయడం, నార్మల్ హెయిర్ ని కర్లీ హెయిర్ గా మార్చడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ హీట్ స్టైలిగ్ చేయడం స్టైలింగ్ కాదు. జుట్టును మరింత ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి, ఇలాంటి పొరపాట్లు చేయకూడదు.
ఓపికగా ఉండాలి...
అందమైన, ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు రాత్రికి రాత్రే వచ్చేయదు. మనం రెగ్యులర్ గా కొన్ని పనులు చేయడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయడం, అవసరం అయినప్పుడు హెయిర్ కట్ చేయడం, కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడటం మానేయడం లాంటివి చేయాలి. అంతేకాదు... మంచి నాణ్యత ఉన్న నీరు వాడటం, ఒత్తిడి తగ్గించుకోవాలి. కనీసం మూడు నెలల పాటు ఒకే రోటీన్ ఫాలో అవ్వడం వల్ల జుట్టు అందంగా మారుతుంది.

