Grey Hair: 30 ఏళ్లకే తెల్ల జుట్టు వచ్చేసిందా? ఇవి రాస్తే మళ్లీ నల్లగా మారడం పక్కా..!
Grey Hair: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి మార్కెట్లొ దొరికే రంగులు, హెయిర్ డైలు వాడుతున్నారా? వాటి వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందనే విషయం మర్చిపోవద్దు.

Grey Hair
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారి సంఖ్య చాలా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, కెమికల్స్ తో నిండి ఉన్న షాంపూలు, నూనెలు వాడటం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య రావచ్చు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే... మార్కెట్లో దొరికే ఏవేవో డైస్ వాడటానికి బదులుగా... ఈ హోం రెమిడీస్ ప్రయత్నిస్తే చాలు. మీ జుట్టును మళ్లీ నిగనిగలాడేలా చూసుకోవచ్చు. మరి, అవేంటో చూద్దాం...
ఉసిరికాయ, కొబ్బరి నూనె ప్యాక్...
సమాన పరిమాణంలో ఉసిరి పొడి, కొబ్బరి నూనె కలిపి మీడియం వేడి మీద వేడి చేయాలి. ఆరిన తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు బాగా పట్టించాలి. బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు మళ్లీ నల్లగా నిగనిగలాడుతుంది. జుట్టు ఆరోగ్యంగా కూడా మారుతుంది. వారానికి రెండుసార్లు ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల మీ జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.
హెన్నా, కాఫీ మిశ్రమం....
బాగా కాచిన కాఫీ డికాషిన్ లో హెన్నా పొడిని కలిపి మంచి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ తెల్ల జుట్టు ఉన్న ప్రదేశాల్లో పూయాలి. దీని వల్ల మీ జుట్టు నల్లగా మారడమే కాకుండా... జుట్టుకు మంచి కండిషన్ చేసి మెరిసేలా చేస్తుంది.
ఇది మీ జుట్టును అందంగా కూడా మారుస్తుంది.
3.ఉల్లిపాయ రసం, తేనె...
ఉల్లిపాయ రసంలో ఒక టీ స్పూన్ తేనె కలపాలి. దీన్ని మీ తలకు అప్లై చేసి 30 నిమిషాలు అలానే ఉంచాలి. ఇది మెలనిన్ ఉత్పత్తిని పెంచడానికి, తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఆల్రెడీ వచ్చిన తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతుంది.
కరివేపాకు, పెరుగు హెయిర్ ప్యాక్...
కరివేపాకును పెరుగుతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ వాడటం వల్ల జుట్టు మూలాలకు పోషణ లభిస్తుంది. జుట్టు నల్లగా మారుతుంది.
మెంతుల హెయిర్ ప్యాక్:
మెంతులను రాత్రంతా నానబెట్టి, వాటిని మెత్తగా పేస్ట్ చేసి, వారానికి ఒకసారి మీ తలకు అప్లై చేయండి. ఇది జుట్టును బలోపేతం చేయడానికి, మెలనిన్ ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా, తెల్ల జుట్టు సమస్య కూడా ఉండదు.
కొబ్బరి పాలు, నిమ్మరసం మిశ్రమం:
కొబ్బరి పాలను కొద్దిగా నిమ్మరసంతో కలిపి మీ తలకు మాస్క్ లాగా అప్లై చేసి మీ జుట్టుకు పోషణ అందించి, తెల్ల జుట్టు రావడం ఆలస్యమౌతుంది.

