Face Glow: చలికాలంలో ముఖానికి ఈ ఒక్కటి రాస్తే చాలు.. అందం రెట్టింపు అవ్వడం ఖాయం
Face Glow: బొప్పాయి మనకు చాలా సులభంగా లభించే పండు. దీనిని వాడి మనం ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. బొప్పాయి పండులో మన అందాన్ని పెంచే చాలా పోషకాలు ఉంటాయి.

Face Pack
రోజు రోజుకీ చలి పెరిగిపోతోంది. ఈ చలిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా చలిని తట్టుకోవడానికి స్వెట్టర్లు, స్వెట్ షర్ట్స్ వంటి వెచ్చని దుస్తులు ధరిస్తూ ఉంటాం. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి కానీ.. చలికి చర్మం మాత్రం దెబ్బ తింటుంది. చల్ల గాలికి చర్మం తొందరగా పొడి బారుతుంది. ఎన్ని రకాల క్రీములు, మాయిశ్చరైజర్లు వాడినా... ముఖం మునుపటిలా అందంగా కనిపించదు. కానీ, ఒకే ఒక్క ఫేస్ ప్యాక్ వాడితే మాత్రం మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అది ఏంటి? దానిని ముఖానికి ఎలా వాడాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
బొప్పాయి పండులో పోషకాలు...
బొప్పాయి పండలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ సి చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. విటమిన్ ఎ చర్మాన్ని మచ్చలు లేకుండా మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. విటమిన్ ఈ యాంటీ ఏజెనింగ్ గా పని చేస్తుంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
చలికాలంలో బొప్పాయి పండు ఎలా పని చేస్తుంది..?
చలికాలంలో గాలి వల్ల చర్మం తేమ లేకుండా తొందరగా ఎండిపోయినట్లుగా కనపడుతుంది. ముఖంపై తెల్లటి మచ్చలు రావడం, పెదాలు ఎక్కువగా పగులుతూ ఉంటాయి. వీటన్నింటినీ తగ్గించడంలో బొప్పాయి చాలా బాగా సహాయపడుతుంది. ఈ సీజన్ లో బొప్పాయి అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. చర్మంలో తేమను నిలుపుకోవడం ద్వారా పొడి చర్మం సమస్యను తగ్గించుకోవచ్చు.
బొప్పాయిని ముఖానికి ఎలా వాడాలి..?
ఒక గిన్నెలో ఒక పండిన బొప్పాయి గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కొని, ఆ తర్వాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు కూడా అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వాడినా మీ ముఖం మెరుస్తూ, అందంగా కనపడుతుంది.

