Plastic Utensils: ప్లాస్టిక్ పాత్రలపై మరకలు పోవడం లేదా? ఈ టిప్స్ ఫాలోకండి
Plastic: మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వస్తువులు భాగంగా మారిపోయాయి. ఇళ్లలో అనేక రకాలైన ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే.. వాటిపై మరకలు పడితే.. పోగొట్టాలంటే చాలా కష్టంగా మారుతుంది. కానీ, ఈ చిట్కాలు పాటిస్తే.. మరకలను ఈజీగా తొలగించవచ్చు.

ప్లాస్టిక్ పాత్రలపై మరకలు
ఇటీవలి కాలంలో ఇంట్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం చాలా పెరిగింది. పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరుకు ఎన్నో రకాల పనులకు ప్లాస్టిక్ ను ఉపయోగిస్తున్నాం. అయితే.. ప్లాస్టిక్ పై మరకలు పడితే మాత్రంపోగొట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ, ఈ చిట్కాలు పాటిస్తే.. మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు.
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు
బకెట్ లేదా మగ్గుపై ఆల్గే పేరుకుపోయినట్లయితే.. దానిని తొలగించడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. దీని శుభ్రం చేయడానికి బకెట్‌లో గోరువెచ్చని నీటిని పోసి, దానిలో డిటర్జెంట్ కలపండి. దాని 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత శుభ్రం చేస్తే.. మురికి సులభంగా తొలగిపోతుంది.
నిమ్మకాయ
మరకలను తొలగించడానికి చాలా మంది నిమ్మకాయను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ పాత్రలు, బకెట్లు , మగ్‌లు కొత్తగా మెరుస్తూ ఉండాలంటే నిమ్మరసం వాడండి. ఇది దుర్వాసనను కూడా తొలగిస్తుంది.
బేకింగ్ సోడా
వంటగదిలో తరచుగా నూనె చిమ్ముతుంది, దీని వలన పక్కనే ఉన్న ప్లాస్టిక్ పాత్రలు దెబ్బతింటాయి. వాటిపై మరకలు కనిపిస్తాయి. అంతేకాకుండా స్నానాల గదిలో నిరంతరం నీరు ప్రవహించడం వల్ల బకెట్లు, మగ్గులకు మరకలు అవుతాయి. ఈ మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి శుభ్రం చేయండి. ఈ రెండింటి కలయికతో మరకలు సులభంగా పోతాయి.
బ్రష్ వాడకం
ప్లాస్టిక్ పాత్ర సరిగ్గా శుభ్రం చేయడానికి బ్రష్ లేదా స్క్రబ్ వాడండి. ప్లాస్టిక్ పాత్రలోని మూలల్లో మరకలు ఏర్పడుతాయి. వీటిని తొలగించడానికి డిటర్జెంట్ తో పాటు బ్రష్ లేదా స్క్రబ్ ఉపయోగిస్తే.. మరకలు సులభంగా తొలగిపోతాయి.