Hair Care: మెంతుల్లో ఇదొక్కటి కలిపి రాస్తే, జుట్టు పొడుగ్గా పెరుగుతుంది..!
మెంతుల్లో నికోటినిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టు మూలాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పొడవాాటి జుట్టుకు బెస్ట్ హోం రెమిడీ
పొడవైన, ఒత్తైన జుట్టు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం, మంచి జీవన శైలి ఫాలో అవ్వకపోవడం, కాలుష్యం తదితర కారణాల వల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అలా కాకుండా ఉండాలని చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు.వాటి వల్ల కూడా ప్రయోజనం లేదు అని మీకు అనిపించినప్పుడు హోం రెమిడీస్ ప్రయత్నించాల్సిందే. ముఖ్యంగా మెంతులను వాడి మన జుట్టు సమస్యలన్నింటినీ పరిష్కరించవచ్చు. కేవలం మెంతులు కాకుండా, దానిలో చిన్న ఉల్లిపాయలను కూడా వాడితే, మీ జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదలకు మెంతులు ఎలా ఉపయోగపడతాయి.?
మెంతులు జుట్టుకు మంచి సూపర్ ఫుడ్ లాంటివి. ఈ గింజల్లో అధిక స్థాయిలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టు నిర్మాణాన్ని బలపరుస్తుంది. అంతేకాదు.. మెంతుల్లో నికోటినిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టు మూలాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, మెంతుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జుట్టు రాలడం తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ చిన్న చిన్న గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జట్టును ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ ఎలా ఉపయోగపడుతుంది?
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వల్ల జుట్టు మందంగా మారుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఉల్లిలో ఉండే విటమిన్ సి, బి6, పొటాషియం కూడా జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి.
మెంతులు, ఉల్లిపాయతో హెయిర్ మాస్క్ రెసిపీ..
మెంతులు, ఉల్లిపాయలతో హెయిర్ మాస్క్ తయారు చేయడానికి మనకు నానపెట్టిన మెంతులు, ఉల్లిపాయ రసం ఉంటే చాలు. నానపెట్టిన మెంతులను మెత్తని పేస్టులాగా రుబ్బుకోవాలి. దాంట్లోనే ఉల్లి రసం కూడా చేర్చాలి. ఇప్పుడు ఈ రెండూ కలిపిన మిశ్రమాన్ని తలంతా బాగా పట్టించి, మంచిగా మసాజ్ చేయాలి. 30 నిమిషాలు అలానే వదిలేసి... ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
మెంతులతో హెయిర్ క్లెన్సర్...
మెంతులను నానపెట్టి, వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడగట్టాలి. ఇప్పుడు దీనికి ఉల్లిపాయ రసం కూడా చేర్చాలి. ఇప్పుడు ఈ రెండూ కలిపిన నీటిని తల, జుట్టుకు బాగా పట్టించాలి.10 నిమిషాలపాటు అలానే ఉంచి, ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా మారుతుంది. అంతేకాదు.. స్మూత్ గా మెరుస్తూ కనపడుతుంది.
మెంతులు, ఉల్లిపాయలతో హెయిర్ ఆయిల్..
మెంతులు, ఉల్లిపాయలతో కలిపి తయారు చేసిన నూనెను రెగ్యులర్ గా తలకు, జుట్టుకు రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దాని కోసం మెంతులను కొబ్బరి నూనెలో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఈ నూనెను వడకట్టాలి. ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ రసం కూడా చేర్చాలి. ఈ నూనెతో తలకు బాగా మసాజ్ చేయాలి. 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి ఒకసారి చేసినా కూడా జుట్టు పెరుగుదలలో మార్పు క్లియర్ గా చూస్తారు.