Beauty tip: ఇదొక్కటి వాడితే పార్లర్ కు వెళ్లనక్కర్లేదు
Beauty tip: ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తుల మధ్యలో కూడా పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్‌పై ఇప్పటికీ వాడేవాళ్లు ఇప్పటికీ తగ్గలేదు. అమ్మమ్మల చిట్కాగా క్రేజ్ ఉన్న ఈ సహజ మిశ్రమం నిజంగా చర్మానికి ఉపయోగపడుతుందా? నిపుణుల అభిప్రాయం, శాస్త్రీయ ఆధారాలు ఏమంటున్నాయంటే..

అమ్మమ్మల చిట్కా
వేల రూపాయలు ఖర్చుపెట్టినా సరే మన ముఖం డల్ గానే కనిపిస్తుంది. అందంగా కనిపించడం లేదని బాధపడిపోతాం. బయటకు రావడానికి ఇష్టపడం. అప్పుడే మనకు అమ్మ చెప్పే స్కిన్ కేర్ చిట్కాలు, అమ్మమ్మలు సలహా ఇచ్చే బ్యూటీ టిప్స్ ఫాలో అయిపోతాం. అందుకే చాలా మంది పెట్టే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, పార్లర్ ట్రీట్మెంట్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్న ఈ రోజుల్లో కూడా మన ఇళ్లలో దొరికే సహజ ప్యాక్ లపై మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బామ్మల కాలం నుంచి వస్తున్న పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ కు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. స్కిన్ పై మంచి రిజల్ట్ ఉంటుందన్న నమ్మకం ఉంది. అయితే ఇది కేవలం నమ్మకమా, లేక నిజంగానే శాస్త్రీయంగా నిరూపితమైందా అన్నదానిపై నిపుణులు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు.
పసుపు, పెరుగు ప్యాక్ తో మెరిసిపోతారు
పెరుగు, పసుపుతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తూ కనిపించడమే కాకుండా మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుతాయని చాలామంది నమ్ముతారు. అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఈ సహజ చిట్కా ఇప్పటికీ పాటిస్తున్నారు.
ఈ రెండూ సహజపదార్థాలే..భయపడక్కర్లేదు
పార్లర్లు, స్కిన్ కేర్ ప్రొడక్టులు ఇష్టపడని వారు ఈపెరుగు, పసుపు ప్యాక్ వాడతారు. ఈ రెండూ సహజపదార్థాలే కావడంతో ఎలాంటి భయం లేకుండా నేరుగా ముఖానికి అప్లై చేస్తుంటారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం సోరియాసిస్, రేడియేషన్ డెర్మటైటిస్, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గడానికి పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, కర్కుమిన్‌ను చర్మంపై ఉపయోగించడం సురక్షితమని, కొన్ని సందర్భాల్లో కార్టికోస్టెరాయిడ్ మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని అంటున్నారు.
అందం మరింత పెరుగు
ఇక పెరుగు విషయానికి వస్తే, ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. దీంతో చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్ గుణాలు చర్మానికి తేమను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వారానికి ఒకసారి
పసుపులోని కర్కుమిన్‌కు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే పసుపును ముఖానికి అప్లై చేసే సమయంలో చాలా తక్కువ మోతాదులోనే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగు, పసుపు మిశ్రమాన్ని వాడటం వల్ల ముఖం రిఫ్రెష్‌గా కనిపించడమే కాకుండా టానింగ్ కూడా కొంతవరకు తగ్గుతుంది. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ కాంబినేషన్ ఉన్నవారు, వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ వాడితే చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

