MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Hair Oil: కొబ్బరి నూనె ఇలా రాస్తే... జుట్టు అందంగా మారడం పక్కా..!

Hair Oil: కొబ్బరి నూనె ఇలా రాస్తే... జుట్టు అందంగా మారడం పక్కా..!

Hair Oil: జుట్టు పెరుగుదలను చాలా అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దుమ్మూ, ధూళి, ఆహారం మాత్రమే కాదు, అధిక ఒత్తిడి కూడా జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే.. మనం హాట్ ఆయిల్ తో జుట్టు కుదుళ్లను, జుట్టు మొత్తాన్ని మంచిగా మసాజ్ చేయాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 27 2025, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొబ్బరి నూనె మసాజ్...
Image Credit : Getty

కొబ్బరి నూనె మసాజ్...

జుట్టు అందంగా, ఒత్తుగా మార్చుకోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. కానీ.. ఈరోజుల్లో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఎంత ఖరీదైన షాంపూలు, సీరమ్స్ వాడినా కూడా జుట్టు రాలడం తగ్గడం లేదని..దానికి తోడు చండ్రు సమస్య కూడా వేధిస్తోందని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే... కేవలం కొబ్బరి నూనెతో చెక్ పెట్టొచ్చు. నార్మల్ గా జుట్టుకు నూనె రాయడం కాకుండా.... నూనెను వేడి చేసి.. జుట్టుకు మంచిగా మసాజ్ చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హాట్ ఆయిల్ మసాజ్....
Image Credit : stockPhoto

హాట్ ఆయిల్ మసాజ్....

జుట్టు పెరుగుదలను చాలా అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దుమ్మూ, ధూళి, ఆహారం మాత్రమే కాదు, అధిక ఒత్తిడి కూడా జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే.. మనం హాట్ ఆయిల్ తో జుట్టు కుదుళ్లను, జుట్టు మొత్తాన్ని మంచిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉపశమనం లభిస్తుంది. తలలో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. హాట్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. దీని కోసం... మీరు కొబ్బరి నూనె లేదంటే.. ఆముదం వాడితే సరిపోతుంది.

Related Articles

Related image1
Hair Care: కలబందలో ఇవి కలిపి రాస్తే.. మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవాల్సిందే..!
Related image2
Hair Care: 40 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన హెయిర్ కేర్ టిప్స్ ఇవి
34
జుట్టు రాలడం తగ్గాలంటే....
Image Credit : stockPhoto

జుట్టు రాలడం తగ్గాలంటే....

మీకు జుట్టు ఎక్కువగా రాలుతోంది అనిపిస్తే... వెంటనే హాట్ ఆయిల్ తో మసాజ్ చేయాలి. అది కూడా విటమిన్ ఇ నూనెను వాడటం మంచిది. బాదం నూనె అయినా వాడొచ్చు. ఇవి వాడటం వల్ల... జుట్టు రాలడం తొందరగా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలపడతాయి. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది.

44
హెయిర్ కండిషనర్ గా కొబ్బరి నూనె...
Image Credit : stockPhoto

హెయిర్ కండిషనర్ గా కొబ్బరి నూనె...

మీ జుట్టు చాలా పొడిగా ఉంటే, మీరు దానిని కొబ్బరి నూనెతో కండిషన్ చేయాలి. ఇది జుట్టు కుదుళ్లలోకి సులభంగా చొచ్చుకుపోతుంది. మూలాల నుండి తేమను అందిస్తుంది. మీరు ఇలా ప్రతిరోజూ చేస్తే, మీ జుట్టుపై రసాయన ఆధారిత కండిషనర్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. దీని కోసం తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు.. జుట్టు కుదుళ్లకు కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి.. జుట్టుకు మసాజ్ చేయాలి. దీని వల్ల జుట్టు మృదువుగా మారుతుంది.

చండ్రు తగ్గాలంటే...

మీరు చాలా కాలంగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లయితే... తలకు టీట్రీ ఆయిల్ తో మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇక.. మీకు రెగ్యులర్ గా హెయిర్ స్ట్రెయిట్నర్ లు లాంటి హీట్ ప్రొడక్ట్స్ లాంటివి వాడే అలవాటు ఉంటే... వాటి వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది. అలా అవ్వగుండా ఉండాలంటే కూడా మీ జుట్టుకు గోరు వెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు డ్యామేజ్ అవ్వగుండా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Hair Care: కలబందలో ఇవి కలిపి రాస్తే.. మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవాల్సిందే..!
Recommended image2
Hair Care: 40 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన హెయిర్ కేర్ టిప్స్ ఇవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved