Hair Care: కలబందలో ఇవి కలిపి రాస్తే.. మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవాల్సిందే..!
దెబ్బతిన్న జుట్టును సహజంగా రిపేర్ చేయడానికి కలబంద చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ కలబందలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

కలబందతో హెయిర్ మాస్క్
ఈ రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరూ జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వీటిలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్య రావడం, చివరలు చిట్లడం, చుండ్రూ లాంటివి ఉన్నాయి. చాలా మంది ఎలాంటి హెయిర్ ప్రాబ్లం వచ్చినా కూడా మార్కెట్లో దొరికే ఏవేవో ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ, మార్కెట్లో లభించే చాలా ఉత్పత్తుల్లో కెమికల్స్ ఉంటాయి. అవి, మీ హెయిర్ ని మరింత డ్యామేజ్ చేసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా.. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనకు సహజంగా లభించే కలబంద వాడాల్సిందే. కలబందలో మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చాలా పోషకాలు ఉన్నాయి. ఇక, వాటిలో మరికొన్ని ఉత్పత్తులను కూడా కలిపితే.. జుట్టును అందంగా మార్చుకోవచ్చు.
జుట్టు మెరిసేలా చేసే కలబంద
దెబ్బతిన్న జుట్టును సహజంగా రిపేర్ చేయడానికి కలబంద చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ కలబందలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును మృదువుగా మారుస్తాయి.
కలబంద జెల్ , గుడ్డు హెయిర్ మాస్క్:
పొడి జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి , కలబంద జెల్‌ను గుడ్డుతో కలిపి మీ జుట్టుకు అప్లై చేసి, కొంత సమయం అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో కడగాలి. షాంపూ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేయడం మర్చిపోవద్దు. కలబంద మీ జుట్టును తేమగా , మృదువుగా చేస్తుంది. గుడ్లలోని ప్రోటీన్ జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ ను వారానికి ఒకసారి వేసుకుంటే, మీ జుట్టు సహజంగా మెరుస్తుంది.
కలబంద జెల్ , మెంతుల హెయిర్ మాస్క్:
మెంతులు, కలబంద హెయిర్ మాస్క్ మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి , చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. దీని కోసం, నానబెట్టిన మెంతి గింజలను బాగా రుబ్బుకుని, కలబంద జెల్ తో కలిపి, హెయిర్ మాస్క్ గా వాడండి.
కలబంద జెల్ , పెరుగు హెయిర్ మాస్క్..
పెరుగు , కలబంద జెల్ హెయిర్ మాస్క్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. దీని కోసం, ఒక చిన్న కప్పు పెరుగును కొద్దిగా కలబంద జెల్ తో కలిపి, బాగా కలిపి, మీ జుట్టు అంతటా అప్లై చేసి, ఆపై తేలికపాటి షాంపూతో కడగాలి. మీరు ఈ హెయిర్ మాస్క్ ను వారానికి రెండుసార్లు అప్లై చేస్తే, చుండ్రు సమస్య త్వరగా తగ్గిపోతుంది.
కలబంద జెల్ , ఉల్లిపాయ రసం:
2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ను 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ రసంతో కలిపి తలకు అప్లై చేసి, 20 నిమిషాలు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో కడిగేయండి. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది. మీరు ఈ చిట్కాను వారానికి రెండుసార్లు చేయవచ్చు.
కలబంద జెల్ , ఉసిరికాయ పొడి:
2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ను 1 టేబుల్ స్పూన్ ఉసిరి పౌడర్ తో కలిపి మీ తలకు అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, తేలికపాటి షాంపూతో కడిగేయండి. ఉసిరి పొడి జుట్టును బలోపేతం చేస్తుంది . మెరుపును జోడిస్తుంది.