MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Face Glow: గంధంలో ఇదొక్కటి కలిపి రాస్తే.. ముఖం మెరిసిపోతుంది..!

Face Glow: గంధంలో ఇదొక్కటి కలిపి రాస్తే.. ముఖం మెరిసిపోతుంది..!

బయట మార్కెట్లో దొరికే క్రీములకంటే.. మన అందాన్ని పెంచే సహజ ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. వాటిల్లో గంధం కూడా ఒకటి.

2 Min read
Author : ramya Sridhar
Published : May 26 2025, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సహజంగా అందంగా మెరవాలంటే..
Image Credit : Social media

సహజంగా అందంగా మెరవాలంటే..

ఏదైనా పార్టీ, ఫంక్షన్, పెళ్లి లాంటి వాటికి వెళ్లినప్పుడు తాము మాత్రమే స్పెషల్ గా కనిపించాలి అనే కోరిక చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది. దాని కోసం దాదాపు అందరూ ఫంక్షన్ కి ముందు రోజు పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ, ప్రతిసారీ అలా ఫేషియల్స్ చేయించుకోవాలి అనుకుంటే చాలా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అంతేకాదు.. మన ఫేస్ కి వాడే క్రీముల్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి.. ఫ్యూచర్ లో స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మరి, ఖరీదైన క్రీములతో ఫేషియల్స్ అవసరం లేకుండా ఒక్క రోజులో అందంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా?

25
గంధంతో మెరిసే అందం..
Image Credit : social media

గంధంతో మెరిసే అందం..

బయట మార్కెట్లో దొరికే క్రీములకంటే.. మన అందాన్ని పెంచే సహజ ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. వాటిల్లో గంధం కూడా ఒకటి. సహజంగా గంధాన్ని మనమంతా పూజల్లో వాడుతూ ఉంటాం. లేదా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కూడా స్త్రీలు తమ ముఖానికి రాసుకుంటూ ఉంటారు. ఇదే గంధం మన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేయడంలోనూ సహాయం చేస్తుంది. కాకపోతే.. ఆ గంధానికి మరొకటి చేర్చాలి. అదే కలబంద. ఈ రెండింటినీ కలిపి ముఖానికి రాస్తే.. క్షణాల్లో ముఖంలో గ్లో పెరుగుతుంది.

Related Articles

Related image1
Face Glow: 40 ఏళ్లు దాటినా ముఖంపై ముడతలు రావద్దంటే, ఇదొక్కటి రాస్తే చాలు..!
Related image2
Face Glow: ఇదొక్కటి రాసినా, పార్లర్ అవసరం రాదు, ఫేస్ గ్లో రావడం పక్కా..!
35
గంధం, కలబంద ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలంటే...
Image Credit : Asianet News

గంధం, కలబంద ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలంటే...

కావలసినవి:

సహజంగా లభించే గంధపు చెక్క

తాజా కలబంద గుజ్జు (లేదా మార్కెట్‌లో లభించే స్వచ్ఛమైన జెల్)

తయారీ విధానం:

గంధపు చెక్కను కొద్దిగా నీటితో రుద్ది, పేస్ట్‌లా తయారుచేసుకోండి. అందులో ఒక టీస్పూన్ తాజా కలబంద జెల్ కలపండి.ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై సమానంగా అప్లై చేయండి. 15-20 నిమిషాల పాటు అలానే ఉంచి, చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

45
ఈ రెండూ కలిపి రాయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు...
Image Credit : pinterest

ఈ రెండూ కలిపి రాయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు...

గంధం చర్మాన్ని చల్లపరుస్తుంది. అలసటను తగ్గిస్తుంది. ఇక కలబంద చర్మాన్ని హైడ్రేటెడ్ గా మారుస్తుంది. వెంటనే ముఖానికి గ్లో తీసుకువస్తుంది. అంతేకాదు.. ముఖం పై మొటిమలు, మచ్చలు రాకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ ముఖంపై మొటిమలు ఉంటే.. వాటిని తగ్గించడంలోనూ సహాయం చేస్తాయి. అంతేకాదు.. వయసు రిత్యా మన ముఖంపై వచ్చే ముడతలను కూడా తగ్గించేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఫంక్షన్ కి ఒక్క రోజు ముందు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసినా..మరుసటి రోజు చాలా అందంగా కనపడతారు.

55
గమనిక..
Image Credit : SOCIAL MEDIA

గమనిక..

ఈ హోమ్ చిట్కా మీ రోజువారీ స్కిన్‌కేర్‌లో భాగం అయితే, మీ చర్మం నిత్యం ఆరోగ్యంగా, మెరిసేలా ఉంటుంది. ఇక ఫేషియల్స్ కోసం బ్యూటీ పార్లర్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు. అయితే.. దేనినైనా ముఖానికి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం చాలా అవసరం. ప్యాచ్ టెస్టులో ఎలాంటి అలర్జీ లేకపోతేనే ముఖానికి అప్లై చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
జీవనశైలి
సౌందర్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..
Recommended image2
Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..
Recommended image3
Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం
Related Stories
Recommended image1
Face Glow: 40 ఏళ్లు దాటినా ముఖంపై ముడతలు రావద్దంటే, ఇదొక్కటి రాస్తే చాలు..!
Recommended image2
Face Glow: ఇదొక్కటి రాసినా, పార్లర్ అవసరం రాదు, ఫేస్ గ్లో రావడం పక్కా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved