Face Glow: ఇదొక్కటి రాసినా, పార్లర్ అవసరం రాదు, ఫేస్ గ్లో రావడం పక్కా..!
వేసవిలో ఎక్కువగా ముఖంలో కళ తప్పుతుంది. ట్యాన్ పేరుకుపోతుంది. ఎన్ని క్రీములు రాసినా ఆ అందం మళ్లీ తిరిగి రాదు. అలాంటివారు కేవలం రెండు, మూడు స్పూన్ల పెసరపప్పు వాడితే చాలు.

మహిళలకు అందంగా కనిపించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖం మీద చిన్న మొటిమ వచ్చినా, ఫేస్ గ్లో కోల్పోయి, పేళవంగా కనిపించినా చాలా ఫీల్ అయిపోతారు. ఆ భయంతోనే మార్కెట్లో దొరికే చాలా ఖరీదైన క్రీములు కొనేసి.. వాటిని ముఖానికి పూస్తూ ఉంటారు. అయితే, మీ దగ్గర అంత బడ్జెట్ లేదా..? కానీ ఫేస్ మాత్రం గ్లో మెరుస్తూ కనిపించాలా? దాని కోసం మీరు మీ ఇంట్లో లభించే ఒకే ఒక్క పప్పు వాడితే చాలు. మరి అదేంటి? దానిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం..
వేసవిలో ఎక్కువగా ముఖంలో కళ తప్పుతుంది. ట్యాన్ పేరుకుపోతుంది. ఎన్ని క్రీములు రాసినా ఆ అందం మళ్లీ తిరిగి రాదు. అలాంటివారు కేవలం రెండు, మూడు స్పూన్ల పెసరపప్పు వాడితే చాలు.
పెసర పప్పుతో ముఖానికి అందం ఎలా పెరుగుతుంది..?
సాధారణంగా, మహిళల ముఖం వేసవి ఎండ వల్ల ప్రభావితమవుతుంది. ఇది చాలా మందికి అసౌకర్యాన్ని ఇస్తుంది. చర్మ సమస్యల గురించి మీరు ఆందోళన చెందుతుంటే, వంటగదిలో సులభంగా లభించే పెసరపప్పు ఉపయోగించవచ్చు. మనం శారీరక ఆరోగ్యానికి పెసరపప్పు తింటాం. కానీ దీనిని ముఖానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.
దీని కోసం, మీరు మొదట అర కప్పు పెసరపప్పును (50-100 గ్రాములు) రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. తరువాత రోజు, నీటిని తీసివేసి, పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలో కలబంద జెల్, పెరుగు, కొద్దిగా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోగా.. మీరు మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని తుడుచుకొని.. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ లా రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత..వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు.ఇలా చేయడం వల్ల పొడి చర్మానికి తేమ లభిస్తుంది. చర్మంలోని కణాలకు విటమిన్లు లభిస్తాయి. దీనిని వారానికి రెండుసార్లు రాసినా.. మీ ముఖం అందంగా కనపడుతుంది.
మరో ఫేస్ ప్యాక్ కూడా వాడొచ్చు. ముఖ్యంగా అవాంఛిత రోమాలను తొలగించడానికి కూడా వాడొచ్చు. దాని కోసం మీరు.. ఈ పెసరపప్పును మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీలో కొంచెం గంధం పొడి, మూడు టేబుల్ స్పూన్ల నారింజ తొక్కల పొడి వేయాలి. దీనిలో కొద్దిగా పాలు కూడా వేసి మంచి మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని మీ ముఖానికి రాయాలి.
దీనిని కాస్త ఆరనిచ్చి.. కొంచెం నీరు చల్లి ముఖాన్ని స్క్రైబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల.. అవాంఛిత రోమాలు ఈజీగా పోతాయి. దీనిని మీరు వారానికి రెండు, మూడు సార్లు ట్రై చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.