- Home
- Life
- Woman
- Hair Oil: చలికాలంలో ఈ నూనెలు రాస్తే.... ఒక్క వెంట్రుక కూడా రాలేదు, ఒత్తుగా పెరుగుతుంది..!
Hair Oil: చలికాలంలో ఈ నూనెలు రాస్తే.... ఒక్క వెంట్రుక కూడా రాలేదు, ఒత్తుగా పెరుగుతుంది..!
Hair Oil: చలికాలంలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందని ఫీలౌతున్నారా? కేవలం కొన్ని రకాల నూనెలు రాస్తే చాలు అని మీకు తెలుసా? ఈ నూనెలను తలకు మంచిగా మసాజ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపడి.. జుట్టు రాలడం ఆగుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది.

Hair Oil
చలికాలం వచ్చింది అంటే చాలు స్కిన్ చాలా డ్రైగా మారిపోతుంది. మరోవైపుు జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. ఈ చలికి తట్టుకోలేక వేడి నీటితో తలస్నానం చేస్తూ ఉంటారు. ఇలా హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల జుట్టు లోని సహజ నూనెలు పోతాయి. దీని వల్ల తలలోని చర్మం పొడిగా మారుతుంది. ఫలితంగా జుట్టు విపరీతంగా రాలుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే... కేవలం కొన్ని రకాల నూనెలను జుట్టుకు రాస్తే చాలు. మరి, ఆ నూనెలు ఏంటి? వాటిని జుట్టుకు ఎలా రాస్తే... హెయిర్ ఫాల్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం....
1.కొబ్బరి నూనె...
కొబ్బరి నూనెను మిరాకిల్ ఆయిల్ అంటారు. చలికాలంలో మీరు కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి..జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి... మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. నార్మల్ గా నూనె కాకుండా.. గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతి వేళ్లతో మసాజ్ చేయాలి అనే విషయం మర్చిపోవద్దు.
2.ఆముదం నూనె...
ఆముదం జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. అంతేకాదు... జుట్టు వేగంగా పెరగడానికి సహాయం చేస్తుంది. ఆముదం నూనెలో రిసినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బాదం నూనె...
బాదం నూనెలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నూనెలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయవచ్చు. ఈ నూనె వల్ల జుట్టు పొడిగా మారదు. మంచిగా షైన్ అవుతూ కనపడుతుంది.
ఉసిరి నూనె...
ఉసిరికాయ నుండి తీసిన నూనె జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, కాలానుగుణంగా జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఉసిరి నూనెలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా, తెల్ల జుట్టు సమస్యను కూడా తగ్గిస్తాయి. ఈ ఉసిరి నూనెను జుట్టుకు బాగా పట్టించి.. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
ఉల్లిపాయ నూనె...
ఉల్లిపాయ నూనె కూడా జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. కెరాటిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. జుట్టును మూలాల నుంచి బలపరుస్తుంది. ఫలితంగా జుట్టు రాలడం తగ్గడమే కాదు, ఒత్తుగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.

